Breaking News

దోమల వ్యాప్తిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ ప్రజలకు పిలుపు

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ మలేరియా దినోత్సవం ఫ్రైడే డ్రె డే పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మలేరియా విభాగం,నగర పాలక సంస్థ వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త అధ్వర్యంలో నగర పట్టణ పరిధిలోని జక్కంపూడి కాలనీలో జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మిశ, మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్రలు మలేరియా నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ, నగర పాలక సంస్థ కమిషనర్ తో కలిసి ఇంటి లోపల, పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి, వ్యాధుల సంక్రమణ పై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ వ్యాధులు పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వ్యాప్తికి కారకాలైన దోమల ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలన్నారు 2030 నాటికి దేశ్ వ్యాప్త మలేరియా నిర్మూలన లక్ష్యానికి ముందుగానే జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.

నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం మాట్లాడుతూ మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు ,పాత టైర్లు ఖాళీ డబ్బాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

జక్కంపూడి కాలనీలోని 10 బ్లాకుల్లో ఇంటింటా పర్యటించి నివాసితులతో కరపత్రం చదివించి వారికి అవగాహన కల్పించారు. సెప్టిక్ ట్యాంకులు మరుగుదొడ్లు పై గొట్టాలకు నైలాన్ తెరలను దగ్గర ఉండి కట్టించి వాటిని డ్రోన్ ద్వారా పర్యవేక్షించారు. బుడమేరులో పేరుకుపోయిన విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలగింపును స్వయంగా పర్యవేక్షించారు.

జక్కంపూడి కమ్యూనిటీ హాల్ లో దోమల వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలపై స్థానికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమల రకాలు, జీవిత చరిత్ర, వాటి నివారణకు తీసుకునే చర్యలు ,దోమల నివారణకు ఉపయోగించే యంత్ర సామాగ్రి ,డ్రోన్లు కటింగ్ మిషన్లు తదితర సామాగ్రి ప్రదర్శనను పరిశీలించారు.

సమావేశంలో ప్రజలతో దోమల నివారణకు తీసుకునే చర్యలు, డ్రైడే ఫ్రైడే కార్యక్రమ ఆవశ్యకత, ధృడ సంకల్పంతో మలేరియా, డెంగ్యూ పారత్రోలతాం అని ప్రతిజ్ఞ, నినాదాలు చేయించారు.
దోమ “కుట్టరాదు -పుట్టరాదు” అనే నినాదంతో ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం దానిలో ప్రజలందరూ భాగస్వామ్యులు అవ్వడం ద్వారా మలేరియా , డెంగ్యూ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మనమందరం కంకణ బద్దులై ఉండాలని, అధికారులు, యంత్రాగం సమర్దవంతంగా కార్యక్రమం అమలుచేసి ప్రజల్లో మార్పు తీసుకురావడం ద్వారా ఈ వ్యాధులు నుండి రక్షణ పోందవచ్చును అని కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. యం సుహాసిని, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డా.ఉషారాణి, జిల్లా మలేరియా అధికారి డా. మోతీబాబు, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా. గోపాల్ నాయక్, ,బయాలజిస్ట్ సూర్య నాయక్, వైద్యధికారులు, యం.పి.డి.ఓ.,మండల స్పెషల్ ఆఫీసర్,నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది,సబ్ యూనిట్ అధికారులు, హెల్త్ అసిస్టెంట్లు,ఏ.ఏన్.ఏమ్ లు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *