Breaking News

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం

-జిల్లాలో ఉన్న పాకిస్థానీలను ఈ నెలాఖరుకల్లా తిరిగి పంపించేయాలని నిర్ణయం
-సాధారణ వీసాపై వొచ్చిన వారు 27 లోగా, వైద్య వీసా పై వొచ్చిన వారు 29 లోగా
-క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లకు ఆదేశాలు జారీ
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించిన నేపధ్యంలో భాగంగా దేశంలో ఉన్న పాకిస్థానీ లు ఏప్రియల్ నెలాఖరుకల్లా తిరిగి పంపించేయాలని నిర్ణయిం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఒక ప్రకటనలో తెలియచేసారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను అమలు చేయాడం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న పాకిస్థానీలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్థానీలకు ఇచ్చిన వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో సాధారణ వీసాలపై వచ్చిన పాకిస్థానీలు ఏప్రియల్ 27 కల్లా, వైద్య వీసాలపై వచ్చినవారు ఏప్రియల్ 29 కల్లా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ నెల 30 తర్వాత అట్టారీ సరిహద్దును మూసివేస్తున్న దృష్ట్యా జిల్లాలో పాకిస్థాన్ వీసాపై వొచ్చిన వారిని గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లను ఆదేశించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *