Breaking News

అర్జీల పరిష్కారంలో స్పష్టతకు ప్రాధాన్యతనివ్వండి..

-పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపండి..
-జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పష్టమైన సమాచారంతో పునరావృతం కాకుండా అర్జీదారుడు సంతృప్తి చేందేలా అర్జీలను పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అన్నారు. పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలకు సంబంధించి క్రింది స్థాయి అధికారులు సిబ్బంది నుండి స్పష్టమైన సమాచారం తీసుకుని అర్జీలు పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించి అర్జిదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పని చేసి ప్రభుత్వ లక్ష్యం నేరవేర్చాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం పై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారన్నారు. సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం లభిస్తుందనే ఆశతో ప్రజలు ఎండ వేడిమిని సైతం లెక్కచేయక సుదీర ప్రాంతాల నుండి తరలి వచ్చి సమస్యలపై ఆర్జీలను సమర్పిస్తున్నారన్నారు. వారి ఆశలను నేరవేర్చి సమస్యలకు పరిష్కారం చూపడంలో జవాబుదారితనంతో అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు.
రెవెన్యూ శాఖకు సంబంధించి 29, పోలీస్‌ శాఖకు 21, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 8, పంచాయతీరాజ్‌ 7, సర్వే 6, డిఆర్‌డిఏ 6, వైద్య 6, జలవనరులు 5, విద్య 4, స్కిల్‌ డవలంప్‌మెంట్‌ 4, కోఆపరేటివ్‌ 3, మెయిన్స్‌ 3, ఉపాధి కల్పన 2, విద్యుత్‌ 2, విభిన్న ప్రతిభావంతులు 2, వ్యవసాయం 2, ఆర్‌డబ్యుఎస్‌, బిసి వెల్ఫేర్‌, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌, రిజిస్టేషన్‌, రైల్వే, లీగల్‌ సర్వీస్‌, సమగ్ర శిక్ష, అటవీ , రవాణ, ట్రైబల్‌ వెల్ఫేర్‌, బ్యాంకుకు సంబంధించిన ఒక్కొక్క అర్జీతో కలిపి మొత్తం 122 అర్జీలను స్వీకరించడం జరిగిందని ఇందులో 32 అర్జీలను స్వయంగాను 90 అర్జీలను అన్‌లైన్‌ ద్వారా స్వకరించిన్నట్లు కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
అర్జీల స్వీకరణలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వి నాంచారరావు గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *