Breaking News

స్విమ్మింగ్ పూల్ కు వేసవి శిక్షణ క్యాంప్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కు వేసవి శిక్షణ క్యాంప్ దృష్ట్యా అధిక సంఖ్యలో విద్యార్ధులు హాజరవుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్  శ్యామల నగర్ మెయిన్ రోడ్ లోని స్విమ్మింగ్ పూల్ ని పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్  తొలుత క్యాంప్ కి ఎంత మంది వస్తున్నారు, నీటి నాణ్యతపై స్విమ్మర్లు, తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ పూల్ ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా నిర్వహించాలని, లైటింగ్, నీటి ఫిల్టరేషన్ ఎప్పటికప్పుడు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రధమ చికిత్స కిట్ ని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రస్తుతం స్విమ్మింగ్ పూల్ కి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారని, మరో పూల్ ఏర్పాటుకు డిమాండ్ ఉన్నందున తగినక్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం శ్యామల నగర్, వెంకటరమణ కాలనీ, పట్టాభిపురం ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, రోడ్ల పక్కన వ్యర్దాలు వేయకుండా ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్ల మీద, డ్రైన్లలో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని, కమర్షియల్ సంస్థలను సీజ్ చేయాలని ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు.
పర్యటనలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, బయాలజిస్ట్ రామారావు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *