తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట అరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్చార్జి ఆఫీసర్ ఎం.టి కృష్ణ బాబు,కమీషనర్ ఆఫ్ ఫ్యామిలీ వీర పాండ్యన్ తో కలిసి తిరుచానూరు మార్కెట్ యార్డు లోని మామిడి ఎగుమతి కేంద్రాన్ని తనీఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. వేపర్ హీట్ ట్రీట్మెంట్ ద్వారా మామిడికాయల క్లీనింగ్, కూలింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసే విధానాన్ని జిల్లా ఉద్యాన శాఖ అధికారిని అడిగి తెలుసుకొన్నారు. ప్యాక్ హౌస్ విధానం, పనితీరు గురించి, ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయాలను ప్యాక్ హౌస్ ఇంచార్జ్ విద్యాసాగర్ చీఫ్ సెక్రటరీకి తెలియజేయడం జరిగింది.
వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెసింగ్ తర్వాత మామిడికాయలను నెదర్లాండ్, జర్మనీ, యూకే, న్యూజిలాండ్, సౌత్ కొరియా, ఇటలీ, జపాన్, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కి తెలిపారు. ఒక రోజుకు 10 టన్నులు మామిడి కాయలు ఎగుమతి చేయడం జరుగుతుందని తెలియజేశారు. 5,6 సంవత్సరాల లో మామిడికాయలు ఎన్ని ఎగుమతి అయినాయి, ఏ ఏ నిధులతో ప్యాక్ హౌసింగ్ నిర్మాణం చేపట్టడం వంటి వివరాలను ఉద్యాన శాఖ అధికారులని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, ఆర్ డి ఓ రామ్మోహన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరమిరెడ్డి జిల్లా నీటి సేద్య అధికారి సతీష్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, డిసిహెచ్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News