Breaking News

విలేజ్ హెల్త్ క్లినిక్ తనిఖీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్చార్జ్ అధికారి ఎo.టి కృష్ణబాబు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి తనపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్చార్జ్ అధికారి మాట్లాడుతూ.. ఆస్పత్రికి రోజు వారి వచ్చు పేషెంట్ల వివరాలు వారికి అందిస్తున్నటువంటి సేవలను గురించి ఆరాధిస్తూ వైద్య సేవలను సకాలంలో అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పిల్లలు, గర్భవతులకు సరైన సమయంలో వాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు. నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్ NCD సర్వే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. సర్వే ద్వారా బీపీ షుగర్ వ్యాధులకు సంబంధించిన డేటా పక్రియ సక్రమంగా నిర్వహించాలని ఏఎన్ఎం లకు సూచించారు. సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా బేబీ షుగర్ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉండాలని వ్యాధి నిర్ధారణ అయినవారికి సకాలంలో చికిత్స అందించేలా చూడాలని తెలిపారు. బీపీ ,షుగర్ కు సంబంధించిన మందులు ఆసుపత్రి నందు అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ సూపర్డెంట్ ను ఆదేశించారు. 104 అంబులెన్స్ వాహనం ద్వారా ఎంత మందికి చికిత్స అందించడం జరిగిందని, వారికి అవసరమైన మందులు అందించేలా ఏఎన్ఎంలు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలకృష్ణ నాయక్, డీఐఓ శాంత కుమారి, డి సి హెచ్ ఎస్ ఆనందమూర్తి మెడికల్ సూపర్ండెంట్ ఉదయశ్రీ ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *