Breaking News

ఎంపి కేశినేని శివ‌నాథ్ తిరువూరు అష్ట‌ల‌క్ష్మీ దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు పట్ట‌ణంలో ఆర్య‌వైశ్య క‌ళ్యాణ మండంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన తిరువూరు డివిజ‌న్ స్థాయి ప్ర‌జా స‌మ‌స్య‌ల ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మం, ప‌ట్ట‌ణంలోని క‌న‌కా రెసిడెన్సీలో నిర్వ‌హించిన తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశంలో పాల్గొనేందుకు సోమ‌వారం విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ కు కల్లూరు క్రాస్ రోడ్డు వద్ద తెలుగుదేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. క‌ల్లూరు నుంచి తిరువూరు వ‌ర‌కు భారీగా కార్ల‌తో ర్యాలీ నిర్వ‌హించారు.

ప‌బ్లిక్ గ్రీవెన్స్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టానికి ముందుగా ఎంపి కేశినేని శివ‌నాథ్ శ్రీ మ‌హాల‌క్ష్మీ స‌హిత అష్ట‌ల‌క్ష్మీ దేవాల‌యంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అమ్మ‌వారి అనుగ్ర‌హం ప్ర‌జ‌లందరిపై వుండాల‌ని కోరుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు

ఈ కార్య‌క్ర‌మంలో తిరువూరు టౌన్ టిడిపి ప్రెసిడెంట్ బొమ్మ‌సాని ఉమ‌మ‌హేశ్వ‌ర‌రావు, ఎపి స్టేట్ ఆర్గానిక్ ప్రోడ‌క్ట్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ చైర్మ‌న్ శావ‌ల దేవ‌ద‌త్తు, తిరువూరు మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు వెదురు వెంక‌ట న‌ర‌సి రెడ్డి, గంప‌ల గూడెం మండ‌ల పార్టీ అధ్యక్షుడు రేగ‌ళ్ల వీరారెడ్డి, ఎ.కొండూరు మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు గ‌డ్డికృష్ణారెడ్డి, ఎన్.టి.ఆర్. జిల్లా రైతు సంఘం అధ్య‌క్షుడు చెరుకూరి రాజేశ్వ‌ర‌రావు, మాజీ ఎ.ఎమ్.సి చైర్మ‌న్ అల‌వాల ర‌మేష్ రెడ్డి, ఎన్.టి.ఆర్ జిల్లా తెలుగు యువ‌త అధికార ప్ర‌తినిధి మాద‌ల హ‌రికృష్ణ‌, గంపల గూడెం తెలుగుయువ‌త అధ్య‌క్షుడు మానికొండ రామ‌కృష్ణ‌, (ఎమ్.ఆర్.కె)టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు నెక్క‌ల‌పు వెంక‌టేశ్వ‌రరావు (బ‌ద్దె), సూర‌ప‌నేని జ‌య‌సింహ‌, టిడిపి నాయ‌కులు సుంక‌ర కృష్ణ‌మోహ‌న్, తాళ్లూరి రామారావు, పుల్ల‌య్య చౌద‌రి, మాజీ ఎంపిపి గ‌ద్దె వెంక‌న్న ల‌తో పాటు తెలుగుదేశం నాయ‌కులు , కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *