Breaking News

క‌లెక్ట‌రేట్‌లో 100 అర్జీల స్వీక‌ర‌ణ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మం సోమ‌వారం తిరువూరులో జ‌ర‌గ్గా.. విజ‌య‌వాడ‌లోని జిల్లా క‌లెక్ట‌రేట్‌లో కూడా ప్ర‌జ‌ల నుంచి ప‌బ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ సిస్ట‌మ్ (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మం ద్వారా అర్జీలు స్వీక‌రించారు. డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం మొత్తం 100 అర్జీల‌ను స్వీక‌రించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 37 అర్జీలు రాగా, పోలీసు శాఖ‌కు సంబంధించి 16 అర్జీలు వ‌చ్చాయి. పంచాయ‌తీరాజ్‌కు 7, పుర‌పాల‌క శాఖ‌కు 6, స‌ర్వే శాఖ‌కు 6 అర్జీలు వ‌చ్చాయి. గృహ నిర్మాణ శాఖ‌కు సంబంధించి మూడు అర్జీలు రాగా పౌర స‌ర‌ఫ‌రాలు, ఫైబ‌ర్ నెట్‌, వైద్య ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమానికి సంబంధించి రెండు చొప్పున అర్జీలు వ‌చ్చాయి. వ‌యోజ‌న విద్య‌, విద్యుత్‌, విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమం, డీఆర్‌డీఏ, విద్య‌, ఉపాధి, ఎండోమెంట్స్‌, మ‌త్స్య‌, ఇరిగేష‌న్‌, లీడ్ బ్యాంక్ మేనేజ‌ర్‌, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్‌, ర‌హ‌దారులు-భ‌వ‌నాలు, రిజిస్ట్రేష‌న్స్‌-స్టాంప్స్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, సైనిక సంక్షేమం విభాగాల‌కు ఒక‌టి చొప్పున అర్జీలు వ‌చ్చాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *