Breaking News

బుడమేరు గట్టు రక్షణకు రిటైనింగ్ వాల్.

-సీజన్ మొదలయ్యే లోగా పనులు పూర్తిచేయాలి
-బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు.
-గతంలో బుడమేరు గట్టుకు 3 గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నిమ్మల

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గత వర్షాకాలంలో ఆకస్మికంగా వచ్చిన వరదకు బుడమేరుకు 3 గండ్లు పడి విజయవాడ ను ముంచెత్తడంతో అప్పటికప్పుడు అత్యవసరంగా యుధ్దప్రాతిపదికన భారీ వర్షాల్లో సైతం బుడమేరు గట్టుమీదనే ఉండి 3గండ్లను పూడ్చి విజయవాడకు వరదముంపును నివారించడం జరిగింది. ఐతే బుడమేరు వరద నుండి విజయవాడ నగరానికి శాశ్వత ప్రాతిపదికన ముంపును నివారించేందుకు, గతంలో పడిన ఈ 3గండ్లను కలుపుతూ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నాం అని, దీని కోసం త్వరలోనే కాంక్రీట్ నిర్మాణ పనులు మొదలుపెట్టబోతున్నాం అని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బుధవారం మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు,మరియు ప్రాజెక్టు ఇంజనీర్లతో కలసి పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.

వెంటనే నిర్మాణ పనులు మొదలుపెట్టి, వర్షాకాలం సీజన్ మొదలయ్యేలోగా, జూన్ 10వ తేదీలోగా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఓకొలిక్కి తీసుకురావాలని, దీని కోసం అదనంగా యంత్ర సామాగ్రిని సమకూర్చుకోవాలని అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారాయన. అదేవిధంగా విజయవాడను వరద ముంపునుండి శాశ్వతంగా రక్షించేందుకు బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా, పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.

బుడమేరు వరద, ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా, డీపీఆర్ తయారీ దశలో ఉందని, బుడమేరు ఓల్డ్ ఛానెల్ కు సమాంతరంగా, మరొక కొత్త ఛానెల్ ను కూడా 20 వేల క్యూసెక్కుల సామర్ద్యంతో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని తెలిపారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మానేజ్మెంట్ కింద, కేంద్రం సహాకారం తో ముందుకు వెళ్ళేలా ప్రపోజల్స్ తయారు చేసాం అని, మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మానేజ్మెంట్ శాఖలు సమన్వయం చేసి ప్రత్తిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతాం అని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *