గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చేపడుతున్న భూముల సర్వే / రీ సర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అధ్యయనం చేసేందుకు 31 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధులకు కేంద్ర గ్రామీణాభివృద్ది , కమ్యూనికేషన్ శాఖ ద్వారా స్థానిక ఐటీసీ వెల్కమ్ హోటల్ రెండు రోజుల నేషనల్ వర్క్ షాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ & స్టాప్స్ శాఖ మంత్రి అనగాని సత్యా ప్రసాద్ , కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ మనోజ్ జోషి , రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ కార్యదర్శి జి. జయలక్ష్మీ, జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , ప్రత్తిపాడు శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, జీయంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మొదటి రోజు ఉదయం సెషన్ ముగిసిన తరువాత మధ్యాహ్నం భూముల సర్వే / రీ సర్వే , భూ రికార్డుల డిజిటలైజేషన్ నేషనల్ వర్క్ షాప్ లో భాగంగా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో క్షేత్రస్థాయి పరీశీలనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ ప్రతినిధులకు వివరిస్తూ వంద సంవత్సరాల క్రితం వున్న ల్యాండ్ రికార్డులను మార్చేందుకు రీ సర్వే డిజిటలైజేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ప్రతి భూ యజమానికి హక్కుతో కూడిన పట్టా ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసోర్స్ ఆధ్వర్యంలో ఈ సర్వేలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూములను సర్వే చేయించి క్యూ ఆర్ కోడ్ తో పాసు బుక్ అందిస్తామని , ప్రతి గ్రామంలో తప్పని సరిగా రీ సర్వే చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆధార్ నెంబర్ తో యూనిక్ ఐడి ఏర్పాటు చేసి గతంలో రీ సర్వే చేయించిన విధానాన్ని మ్యాప్ ద్వారా ప్రతినిధులకు వివరించారు. క్యూ ఆర్ కోడ్ చేసిన పాసు పుస్తకాన్ని చూపించారు. ఈ కార్యక్రమంలో, డిఆర్ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి , ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , విఆర్ఓ లు, ఈఆర్ఏ లు , సర్వేయర్లు , రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News