Breaking News

అందరికీ ఉద్యోగ అవకాశాలు అద్భుతం..

-మంత్రి కొల్లు రవీంద్ర
-జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కృష్ణా యూనివర్సిటీలో అచీవర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా విశ్వవిద్యాలయం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా విశ్వవిద్యాలయంలో ఫార్మసీ, ఇంజినీరింగ్ విద్యార్ధులకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడం అద్భుతం అని రాష్ట్ర గనులు , భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. గురువారం డా బిఆర్ అంబేడ్కర్ అకడమిక్ బ్లాక్ లోని రవీంద్రనాథ్ ఠాగూర్ సమావేశపు మందిరంలో మొదటిసారి ఏర్పాటు చేసిన అచివర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విశ్వవిద్యాలయంలో చదువును పూర్తి చేసుకుని ప్రాంగణ ఎంపికల ద్వారా వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన యువతకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి ఉద్యోగ నియామక పత్రాలను అందించి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకోర్చి పిల్లలను చదివిస్తారని, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సాధిస్తే వారి తల్లితండ్రులను గర్వపడేలా చేసినవారవుతారని అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఎవరైతే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారు తప్పక అభివృద్ధిని సాధిస్తారన్నారు. రూ. 45 కోట్లతో విశ్వవిద్యాలయంలో సర్వ సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. పల్లె తుమ్మలపాలెం గ్రామంలో మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, దీని ద్వారా పెద్ద మొత్తంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తికానున్నదని, ఈ నేపథ్యంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయని, యువత ఇతర నైపుణ్యాలు అభివృద్ధి చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. ప్రపంచంలో అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారతదేశమని, యువత వినూత్నంగా ఆలోచిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, ఆ దిశగా యువత కృషి చేసి అభివృద్ధి చెందాలని సూచించారు.

జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, సంవత్సరాలు తరబడి ఒకే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని, ఇతర ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. ఇంజినీరింగ్, డాక్టర్ కోర్సుల వైపు కాకుండా ఇతర రంగాలను ఎంచుకోవడం కూడా చాలా అవసరం అన్నారు. స్వీయ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఉద్యోగాలు పొందిన యువతకు ఈ సందర్భంగా సూచించారు.

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ మాట్లాడుతూ కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ఏడాదికి తొమ్మిది లక్షల రూపాయలు ప్యాకేజీతో ఎంపిక అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొంత మంది విద్యార్థులు ఏడు, నాలుగు ఉద్యోగాలు పొందడం ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకుల పనితీరుకు నిదర్శనమన్నారు.

రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్దమొత్తంలో ప్యాకేజ్ ద్వారా ఉద్యోగం పొందిన విద్యార్ధులను మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సత్కరించారు. ఉద్యోగాలు పొందిన విద్యార్ధుల తల్లితండ్రులకు సత్కారం చేసి వారీ చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొనకళ్ళ జగన్నాధ రావు (బుల్లయ్య), నెక్స్ట్ హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఈఓ సాయికృష్ణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, పలువురు ఆచార్యులు, విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *