-అట్టహాసంగా ప్రారంభం అయిన 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ 21 సంబంధించిన క్యాంపెయిన్ యోగాంధ్ర 2025
-యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-యోగాను నిత్యం ప్రతి ఒక్కరు గంట పాటు చేసి వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మరియు ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అంతర్జాతీయ యోగా డే జూన్ 21 కర్టన్ రైజర్ యోగాంధ్రా 2025 కు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా యోగా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలసి అట్టహాసంగా కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. యోగా మాస్టర్లు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి యోగ ఆసనాలను నేడు సుమారు 45 నిమిషాల పాటు యోగా చేయడం జరిగిందని తెలిపారు. జూన్ 21 వ తేది విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా డే ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా కలెక్టర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. యోగాపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సి అవసరం ఉందని, శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మే 21 నుంచి జూన్ 21వ వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. యోగాను తిరుపతి జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్,వార్డులలో, మండల, గ్రామ పంచాయతిలలో మారుమూల గ్రామాలలో చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియపరుచవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై వుందని తెలిపారు. అలాగే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు యోగా ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు. మన సంస్కృతి,సాంప్రదాయలు ప్రతిబింభించేలా యోగా గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యపరచవలసిన అవసరం ఉందని తెలిపారు .
శాసన సభ్యులు అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగాను కేవలం జూన్ 21 వ తేది మాత్రానికే పరిమితం చేయకుండా నిత్యం చేయాలని విశ్వమంతా యోగాతో ఆరోగ్యం నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే ని ఐదు లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నంలో జరిగే యోగా డే లో పాల్గొంటున్నారని తెలిపారు. సూరత్ లో 2023లో కోటి యాభై మూడు లక్షల మందితో సామూహిక యోగా నిర్వహించి గిన్నీస్ రికార్డ్ నెలకొల్పారని , ఆ రికార్డ్ బద్దలు కొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల మందితో సామూహిక యోగా ను నిర్వహిస్తోందని తెలిపారు. యోగాను నిత్యం ప్రతి ఒక్కరు గంట పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ : సామూహిక యోగా లో ప్రజలంతా పాల్గొని రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేయాలని ఆయన కోరారు. కాగా యోగాను ప్రతి ఒక్కరు జీవితంలో ఒకభాగం చేసుకోవాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. యోగాపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సి అవసరం ఉందని శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఉమా, రిజిస్ట్రార్ రజని , జిల్లా రెవిన్యూ అధికారి నరసింహులు , రెవిన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, యాదవ కార్పోరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరి బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ ఛైర్ పర్శన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మున్సిపల్ కార్పోరేషన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది , ప్రజా ప్రతినిధులు, యువత మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News