-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా రహదారి భద్రత సమావేశం ఈరోజు రహదారి ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పక్కా ప్రణాళికతో కృషి చేయాలని, టూవీలర్ వాహనాల చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్టానిక కలెక్టరేట్ వీడియో కాన్పిరన్స్ హాలు నందు జరిగిన జాతీయ రహదారుల పై నిత్యం జరిగే ప్రమాదాలపై జిల్లా రహదారి భద్రత కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంయుక్తంగా సమీక్ష సమేవేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై ఇప్పటివరకు జరిగిన రహదారి ప్రమాదాలపై ఆడిట్ నిర్వహించాలని జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. జిల్లాలో పోలీస్ మరియు రవాణా శాఖ వారు సంయుక్తంగా నిర్వహించి గుర్తించిన 100 ప్రమాద బ్లాక్ స్పాట్స్ పై నివేదికను జాతీయ రహదారి అధికారులను కోరారు . తిరుమల ఘాట్ రోడ్లపై ఫిట్నెస్ లేని వాహనాలను ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించరాదని రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారిని ఆదేశించారు.అలాగే పూర్తిస్థాయిలో ఘాట్ రోడ్డును నాన్ స్టాప్ జోన్ గా పరిగణించాలని దానికి సంబంధిత చర్యలను తీసుకోవాలని టిటిడి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1033 విధిగా అందరు ప్రయాణికులు వినియోగించేలా ఆ టోల్ ఫ్రీ నెంబర్ గురించి అవగాహన ఉండేలా అందరి అధికారులతో కలసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో హిట్ అండ్ రన్ ప్రమాదాలపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించి తద్వారా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న ఇన్సూరెన్స్ సత్వరమే అందించాలని కలెక్టర్ గారు తెలియజేశారు. అన్ని శాఖలు విడివిడిగా కాకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని తెలియజేశారు. రవాణా శాఖ వారు క్రమం తప్పకుండా చేసే ఎన్ఫోర్స్మెంట్ కాకుండా రహదారి భద్రత సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ చేయాలని కలెక్టర్ గారు రవాణా శాఖ అధికారిని ఆదేశించారు.మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణించి వాటిపై వాహన తనిఖీ రసీదులు నమోదు చేయాలని పోలీస్ మరియు రవాణా శాఖ వారికి తెలియజేశారు. దారికి విరుద్దంగా ( రాంగ్ డైరక్షన్ లో ) వాహనాలను నడిపే వారిపై 2000 కేసులు రాసిన పోలీస్ అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించాలని ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారుల పై ప్రయాణం చేసేటప్పుడు అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వలన ప్రాణాలు కోల్పోటం జరుగుతుంది తెలిపారు. మండల స్థాయి పోలీస్ అధికారులను ఉద్దేశించి నిత్యం గ్రామస్థాయి నుండి జాతీయ రహదారుల పైకి వెళ్లే ద్విచక్ర వాహనదారులందరికీ రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించాలని తద్వారా వారు ప్రమాదాల బారిన పడకుండా ఉండగలరని తెలిపారు. అలాగే పాఠశాల మరియు కళాశాల బస్సులను క్రమం తప్పకుండా తనిఖీ వాహన డ్రైవర్లకు పలు శిక్షణ సదస్సులు నిర్వహించాలని జిల్లా రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. రవాణా శాఖ వారిని తక్షణమే బ్రిత్ అనలేజర్ మరియు స్పీడ్ లేజర్ గన్స్ సమకూర్చుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి మురళి మోహన్, ఎస్. ఈ, ఆర్ అండ్ బి మధుసూదన్ రెడ్డి, నెల్లూరు , తిరుపతి మరియు చెన్నై ఎన్.హెచ్.ఏ.ఐ పిడి లు ఎం కే చౌదరి, వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, డిఎంహెచ్వో బాలకృష్ణ నాయక్, తుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్ర, ఆర్ అండ్ బి అధికారులు నేషనల్ హైవే సిబ్బంది టీటీడీ విజిలెన్స్ అధికారులు వే ఫౌండేషన్ సిబ్బంది మరియు జిల్లా అదికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News