-కమ్మ, రెడ్ల పాలన పై ఏఐబిఎస్పి పోరాటం
-నేషనల్ కోఆర్డినేటర్ గా డాక్టర్ జె. పూర్ణచంద్ర రావు మాజీ డీజీపీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాటి నుంచి నేటి వరకు కమ్మ రెడ్డి కులనాయకుల ఆధిపత్యమే కొనసాగుతుందని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జె. పూర్ణచంద్రరావు వ్యాఖ్యానించారు. ఈ ఆధిపత్య ధోరణి ఎదుర్కోవాలంటే బహుజనులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు. కమ్మ రెడ్ల పేర్లు చెబితేనే రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బహుజనులకు తగిన ప్రాధాన్యత జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన… బి. పరంజ్యోతి, లక్కే రాజారావు మాజీ ఎమ్మెల్యేలతో కలిపి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కులాలకు చెందిన వారే పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిపత్య కులాల పై అణిచివేయబడిన కులాలు చేయాల్సిన పోరాటం ఆసన్నమైందన్నారు. భవిష్యత్తు తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం కులాల కోసం పని చేస్తుందన్నారు. అందరినీ కలుపుకోని ముందుకు వెళ్తామన్నారు. ప్రజలకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజానికి తెలియజేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సూచించారు. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో బీసీ లకు 52% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. బీసీ సంరక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేసారు.
డిలిమిటేషన్ వాయిదా వేయాలని హిందీ ని రుద్దకూడదని ఏఐబిఎస్పి నేషనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అన్నారు. ఏఐబిఎస్పి కాన్షీరాం బీఎస్పీ అని లక్నో బీఎస్పీ ని మాయావతి బీఎస్పీ అని నూతనంగా నియమించిన ఏఐబిఎస్పి ఆంధ్ర ప్రదేశ్ ప్రెసిడెంట్ మరియు మాజీ ఎంఎల్ఏ లకే రాజా రావు అన్నారు. స్టేట్ కోఆర్డినేటర్ బి పరంజ్యోతి ప్రజల సమస్యల పై అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు.
Prajavartha Online Telugu News