Breaking News

ప్రభుత్వ స్కిల్ హబ్ లో ఉచిత శిక్షణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజక వర్గం లో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగా తిరుపతి నియోజక వర్గం లోని గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల (S.V Govt Polytechnic College, Tirupati) నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలోని నిరుద్యోగయువతను గుర్తించి ఆయాప్రాంతాలలోగల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణగా శిక్షణ మరియు ఉపాధిఅవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ స్కిల్ హబ్ లో ఉచిత శిక్షణ కార్యక్రమములు ఏర్పాటు చేయుటజరిగినది. ఇందులో భాగంగా తిరుపతి నియోజకవర్గంలో గవర్నమెంట్ యస్ వి పాలిటెక్నిక్ కళాశాల నందు స్కిల్ హబ్ గా ఎంపిక చేశారు.

ఈ స్కిల్ హబ్ లో
సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ (Software Programmer)
కాలవ్యవధి : 320 గంటలు
విద్యార్హత: 10 వ తరగతి/ఆపైన
వయసు: 15 సం. నుండి 45 సం.

కావున ఈ శిక్షణ పొందుటకై ఆసక్తిగల అభ్యర్థులను నుండి అప్లికేషన్లను/రిజిస్ట్రేషన్ లను స్వీకరించడం జరుగుతున్నది. ఇందు కొరకై రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దిలీప్ హబ్ కోఆర్డినేటర్ 8143576866 ను సంప్రదించండి. అలాగే ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలనూ కింద తెలిపిన లింక్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
https://forms.gle/5iSKCdBiUjaXL4H79

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *