Breaking News

యోగా ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారి దైనందిన జీవితంలో యోగా భాగమయ్యేలా చూడాలి

-ప్రతి ఒక్కరినీ యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాలి: జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య సంరక్షణ కు ప్రతి ఒక్కరికకి తమ దినచర్యలో యోగాను బాగంగా చేయాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరినీ యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక కమీషనర్ ఎన్. మౌర్యలతో కలసి యోగాంధ్ర-2025 కార్యక్రమాల నిర్వహణ , యోగాంధ్ర యాప్ నందు ప్రజల రిజిస్ట్రేషన్స్ నమోదు పై సంబందిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగ పై అవగాహన పెంచేందుకు యోగాంద్ర కార్యక్రమం కొనసాగిస్తున్నామని ఇందులో భాగంగా మండల,గ్రామస్థాయి వరకు అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని, ఇందులో అందరు ప్రజలకు యోగ సాధనపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ నమోదు చేయించి యోగను ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం చేయాలని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలలో ప్రజాప్రతిధులను భాగస్వామ్యం చేసి యోగాంధ్ర కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని అన్నారు.

ఇప్పటి వరకు గుర్తించిన మాస్టర్ ట్రైనర్ల ద్వారా ట్రైనర్ లకు మే 31 వరకు శిక్షణ ఇస్తున్నామని అనంతరం వీరు ప్రజలకు యోగా పై శిక్షణ అందించనున్నారని తెలిపారు. జూన్ 21 నాటికి ప్రతీ ఒక్కరు యోగ పై అవగాహన కలిగి, సాధన చేసే విధంగా ఉండాలని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలలో వివిద పోటీల నిర్వహణ బాగా జరిగేలా డి. ఈ. ఓ. చర్యలు తీసుకోవాలని తెలిపారు. యోగాంధ్ర యాప్ నందు జిల్లాలో పది లక్షల మంది ప్రజల నమోదు లక్ష్యం ఉండగా ప్రస్తుతం వరకు కేవలం 1 లక్షా 30 వేల మందిని మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగాయని తక్కువగా ఉందని, ప్రజలకు యోగాపై అవగాహనను పెంచి రిజిస్ట్రేషన్స్ నమోదు పెంచేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ , జిల్లా స్థాయిలో సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్కూల్స్ నందు నిర్వహించే యోగా కార్యక్రమాలో విద్యార్థులు అధికంగా పాల్గొనే చేయాలని, వీరికి పోస్టర్స్, షార్ట్ ఫిల్మ్స్, క్విజ్ వంటి పోటీలు నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యా సంస్థలలో ప్రతి రోజు ఒక గంట సేపు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

తిరుపతి జూ పార్క్ నందు నేడు యోగా కార్యక్రమాలు చక్కగా నిర్వహించడం జరిగిందని అదే విధంగా చంద్రగిరి , శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, తిరుమల ప్రాంతాలలో నిర్దేశించుకున్న తేదీలలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నారాయణవనం, ఏర్పేడు, తడ, వాకాడు మండలాలలో యోగాంధ్ర యాప్ నందు ప్రజల నమోదు తక్కువ ఉందని పెంచేందుకు ఎంపిడిఓ లు చర్యలు తీసుకుని నమోదు శాతం పెంచాలని తెలిపారు.

తిరుపతి నగరపాలక కమీషనర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా నగరపాలక పరిధిలో పోటీ కార్యక్రమాలు బాగా నిర్వహిస్తున్నామని అదే విధంగా 1 లక్ష మంది రిజిస్ట్రేషన్స్ నమోదుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ టెలీ కాన్ఫెరెన్స్ కు వివిద జిల్లా అధికారులు, ఆర్డీ టూరిజం డా. రమణ ప్రసాద్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎంపిడిఓ లు, మున్సిపల్ కమిషనర్లు సచివాలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *