Breaking News

హస్తకల,కలంకారి కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం.

-మాధవమాల హస్తకళలను అభివృద్ధి చేస్తాం:
-హస్తకల బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు
-జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
హస్త కళ,కలంకారి కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, హస్తకళా బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకొంటామని మాధవమాల నందు హస్త కళా,కలంకారి క్లస్టర్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హస్త కళల కేంద్రాన్ని సందర్శించడం, చెక్క బొమ్మల తయారీ హస్తకలల ను, కలంకారి వారు చేస్తున్న విధానాన్ని పరిశీలించడం జరిగినదని, వారు చేస్తున్న విధానం, నైపుణ్యం గురించి తెలుసుకోవడంతో పాటు శ్రీ బాలాజీ వుడ్ కార్వింగ్ ఆర్టిజన్ మ్యూచువల్ ఏఇడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారి ద్వారా వారికి కావలసిన సదుపాయాలు మరియు వసతులు పై చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోని వారికి ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. తిరుపతి జిల్లాలో హ్యాండీ క్రాఫ్ట్ హబ్ గా మాధవ మాలలో జరుగుతున్న వారి కలలకు దేశ, రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉందని తెలిపారు. వారికి టెక్నాలజీ ఉపయోగించి యంత్రాల ద్వారా బొమ్మలు తయారు చేస్తే కోర్ స్కిల్ పోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చేతి వృత్తి చేస్తున్న వారికి టూల్ కిట్స్ అందజేస్తామని తెలిపారు. వారి గుర్తింపునుకు తగిన గుర్తింపు కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లేపాక్షి వారితో మాట్లాడి ధరలు పెంచేందుకు తీసుకుంటామన్నారు. బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాయితీ రుణాలను అనుసంధానిస్తా మన్నారు. కొయ్యి బొమ్మల తయారీదారులకు రా మెటీరియల్ నిల్వ చేసుకునేందుకు డిపో ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. నిజమైన కళాకారులకు డ్వాక్రా బజార్లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసుకొనుటకు ప్రాధాన్యత ఇస్తామని, ఎయిర్ పోర్ట్ నందు షాపు ఏర్పాటుకు ఎయిర్ పోర్ట్ అధికారులతో మాట్లాడి సహకారం అందిస్తామన్నారు. తిరుమలలో షాపులు ఏర్పాటు కు, టీటీడీ కళ్యాణ మండపా లలో నామినల్ రేటుకి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకొనుటకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారితో మాట్లాడి సహకారం అందిస్తానన్నారు. కర్లపూడి గ్రామంలోని కళాకారులకు మోటార్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లు లేని కళాకారులకు మూడు సెంట్లు భూమిని కేటాయించుటకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్వరలో హస్త కళాకారులు మరియు బ్యాంకు అధికారులతో కలసి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి , డి ఆర్ డి ఏ పిడి శోభనబాబు,డి ఆర్ డి ఏ ఏ పి డి పి. ప్రభావతి, జిల్లా జీవనొపాదుల అధికారి టి. ధనంజయ రెడ్డి, తహసీల్దార్ భార్గవి, ఎం పి డి ఓ సౌభాగ్యమ్మ, గ్రామ సర్పంచ్ కరీముల్లా, ఏరియా కోఆర్డినేటర్ వనజాక్షి, ఎస్వీఈపి ఏపిఎం దూర్వాసులు నాయుడు. ఏపి ఎం కోమల, హస్తకళల సెక్రెటరీ దశరదాచారి, శ్రీ బాలాజీ వుడ్ కార్వింగ్ ఆర్టిజన్ మ్యూచువల్ ఎయిర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షులు టి లోకనాథ ఆచారి, సెక్రెటరీ రాజా చారి, సీఈవో కృష్ణమూర్తి హస్త, కలంకారి కళాకారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *