Breaking News

గాంధీపురం గ్రామ పంచాయితీ పరిధిలోని రిలాక్స్ వెల్ మాట్రిసెస్ పరిశ్రమ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్

-నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను కాలుస్తూ వాతావరణ కాలుష్యం చేస్తున్న గాంధీపురం గ్రామ పంచాయితీ పరిధిలోని రిలాక్స్ వెల్ మాట్రిసెస్ పరిశ్రమ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-జరిమానాకు ఆదేశించిన కలెక్టర్
-నోటీసు అందచేసిన జిల్లా పంచాయితీ అధికారిణి కార్యాలయం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ మండలములో గాంధీ పురం గ్రామ పంచాయతీ పరిధిలో హైవేపై నున్న M/s. Relaxwell Mattressess (రిలాక్స్ వెల్ మాట్రిసెస్) వారు నిబంధనలకు విరుద్దముగా, సదరు కంపెనీ వ్యర్ధములను రోడ్డు ప్రక్కన వేసి కాల్చడాన్ని జిల్లా కలెక్టరు డా. వెంకటేశ్వర్ ఎస్ గారు నేటి గురువారము (29-05-2025) ఉదయం గమనించి పరిశ్రమ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి, మంటలను ఆర్పించి, జరిమానాకు పంచాయితీ అధికారులను ఆదేశించారు.

– వ్యర్ధాలను కాల్చడము ద్వారా వెలువడే పొగతో ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి నిబంధనలకు విరుద్ధముగా ప్రవర్తించిన సదరు యాజమాన్యులపై కఠిన చర్యలు తీసుకొని జరిమానా విధించమని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించడం జరిగినది.
– రోడ్ల ప్రక్కన నిబంధనలకు విరుద్దముగా చెత్తవేయడము, కాల్చడము నేరము, ఇక మీదట ఇటువంటి చర్యలు పాల్పడిన వారికి పంచాయతీ రాజ్ చట్టం నందలి సెక్షన్లు 84, 94 మేరకు భారీ జరిమానాలు విధించబడతాయి. సెక్షను 127 మేరకు వ్యాపార లావాదేవీలకు సంబంధించిన లైసెన్సులు రద్దు చేయబడునని కలెక్టర్ హెచ్చరించారు
– అదేవిధముగా భారీ భవనాలు, వ్యాపార కట్టడాలు నిర్మించే వారు నిర్మాణ సమయములో వచ్చే వ్యర్ధాలను సక్రమముగా అనుమతిని పొందిన ప్రదేశాలలో మాత్రమే పారవేయవలెనని తెలిపారు.
– బహిరంగ ప్రదేశాలలో భవన నిర్మాణానికి సంబంధించిన వ్యర్ధాలను పడవేసిన వారికి కూడా జరిమానాలు విధించి, భావన నిర్మాణ అనుమతులు రద్దు చేయబడతాయని అన్నారు.
– నిబంధనలకు విరుద్దముగా చెత్త కాల్చిన తిరుపతి గ్రామీణ మండలము గాంధీపురం పంచాయతీ లోని M/s. Relaxwell Mattressess యాజమాన్యానికి రూ.50,000/- లు జరిమానా విధించడం జరిగిందనీ, సదరు నోటీసును వారికి అందజేయడం జరిగిందనీ జిల్లా పంచాయితీ అధికారిణి సుశీల దేవి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *