విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన వైసిపి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ వైసిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4 న తేదీన విజయవాడ పశ్చిమలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులందరు పాల్గొని విజయవంతం చేయాలనీ, ప్రజలకు ఈ కార్యక్రమం పట్ల విస్తృత ప్రచారం చేసి, ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలనీ కోరారు
Prajavartha Online Telugu News