Breaking News

కడప మహానాడు సూపర్ సక్సెస్

-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
-కడపపై జగన్ కు భ్రమలు తొలగిపోయాయన్న మంత్రి సవిత
-చంద్రబాబుపై ప్రజలకు అపార నమ్మకం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా
-కడపలో పదికి పది గెలుస్తాం : మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి
-పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం : ఎమ్మెల్యేలే కాల్వ, పుత్తా, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో నిర్వహించిన టీడీపీ కడప మహానాడు సూపర్ సక్సెస్ అయ్యిందని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆనందం వ్యక్తంచేశారు. మహానాడు విజయవంతానికి కృషి చేసిన టీడీపీ ఉమ్మడి కడప జిల్లా నాయకులకు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కడప మహానాడు విజయంతం కావడంతో, గురువారం నగరంలోని ఓ హోటల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీడీపీ నాయకులతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. కడప మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ఆమె పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో టీడీపీ మహానాడు సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు. ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయంగా మహానాడును దిగ్విజయంగా నిర్వహించారు. మహానాడు నిర్వహణకు నియమించిన 13 కమిటీ సభ్యులు కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. మహానాడు విజయవంతమవ్వడంలో తాను కూడా భాగస్వామ్యం కావడం అదృష్టమన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసింది… చేస్తుందీ కూడా సీఎం చంద్రబాబునాయుడేనన్నారు. రాయలసీమ అభివృద్ధిపై . సీఎం చంద్రబాబుకు ప్రత్యేక విజన్ ఉందన్నారు. రాయలసీమలో 2019 వరకూ టీడీపీ హయాంలో రూ.13 వేల కోట్లను నీటిపారుదల ప్రాజెక్టులకు ఖర్చు చేశామన్నారు.

కడప గడ్డ టీడీపీకి అడ్డా…

రాయలసీమ అభివృద్ధి టీడీపీతోనని, రక్తం పారేచోట అభివృద్ధి బాటలు వేయిస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు. టీడీపీ మహానాడు విజయంతం కావడంతో కొన్ని దుష్టశక్తులు కుమిలిపోతున్నాయన్నారు. కడప తమ గడ్డ అని నిన్నటి భీరాలు పలికిన కొందరికి నిన్నటి మహానాడుతో భ్రమలు తొలిగిపోయాయయన్నారు. టీడీపీకి కడప గడ్డ అడ్డా అని మంత్రి సవిత స్పష్టంచేశారు.

చంద్రబాబుపై ప్రజలకు అపార నమ్మకం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకున్న అపారమైన నమ్మకం మరోసారి రుజువైందన్నారు. కడప మహానాడు కనీవిని ఎరుగని రీతిలో విజయవంతమైందని ఆనందం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో కడప మహానాడు స్ఫూరితో మహానాడులను విజయవంతం చేస్తామన్నారు. మహానాడు వేదికలు పలు తీర్మానాలు చేశామన్నారు.

కడపలో పదికి పది గెలుస్తాం : మంత్రి రాంప్రసాద్ రెడ్డి

మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు నిర్వహణకు అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకు, మంత్ర లోకేశ్ కు రాష్ట్ర రోడ్దు, భవనాల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కడప మహానాడుకు రాయలసీమలోని అన్ని నియోజక వర్గాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలొచ్చారన్నారు. ఈ విజయంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పదికి పది శాసనసభ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, కడప మహానాడు విజయంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చిందని తెలిపారు. మహానాడు వేదికగా రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. రాయలసీమను సస్య శ్యామల చేయడమే కాకుండా సుసంపన్నం చేస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు కోసం ప్రస్తుతం రూ.3,873 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. మరో పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెడతామన్నారు. రూ.వెయ్యి కోట్లతో గాలేరు-నగరి నుంచి కడపకు నీరు తీసుకొస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ, ప్రజలతో పాటు ప్రకృతి కూడా టీడీపీ మహానాడు విజయవంతానికి సహకరించిందన్నారు. రాయలసీమ బిడ్డగా సీఎం చంద్రబాబునాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి, భూపేశ్ రెడ్డి, సీహెచ్ జగన్ మోహన్ రాజు కూడా తదితరులు కూడా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *