Breaking News

మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక ర్యాలీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజం బాగుండాలన్న, ప్రతి ఒక్కరి భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉండాలన్న మాదక ద్రవ్యాలకు బానిస కారాదని మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి కే స్వాతి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుండి లక్ష్మీ టాకీస్ వరకు వృద్ధ జనులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభయాన్ పేరుతో బ్యానర్లు ప్లకార్డులు పట్టుకుని మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుండి 26వ తేదీ వరకు నషా ముక్త భారత అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, గంజాయి , మారిజువాన వంటివి మాదకద్రవ్యాలన్నారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదకరమైన వ్యసనమన్నారు. యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం ఒకటని, దేశంలో యువత 25 శాతం ఉందన్నారు. ప్రజలు ఎవరూ కూడా ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి మంచి భవిష్యత్తును నాశనం చేసుకోరాదన్నారు. మత్తు పదార్థాలకు బానిసైతే కుటుంబాలు, సమాజము దెబ్బతింటాయన్నారు. మాదక ద్రవ్యాల వలన చాలా అనర్ధాలు కలుగుతాయని ప్రజలకు వివరిస్తూ వాకథాన్, మారతాన్ అవగాహన ర్యాలీలు, వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తున్నామన్నారు. మత్తు పదార్థాలకు బానిసైతే కుటుంబాలు, సమాజము దెబ్బతింటాయన్నారు.

డిఎస్పి సిహెచ్ రాజా మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు, గతంలో మత్తు పదార్థాలకు బానిసైన వారితో కలిసి ర్యాలీ నిర్వహించామన్నారు. మచిలీపట్నంలో కొంతమంది అక్కడక్కడ గంజాయి అమ్మకం చేస్తున్నారన్నారు. యువత గంజాయికి బానిస అయితే యువత భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. మత్తు పదార్థాల వాడకం మానివేయాలన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు వారికి ఆరోగ్యపరంగా గాని అన్ని విధాలుగా సహాయం చేస్తాయన్నారు. ఇటీవల ఒక బీటెక్ విద్యార్థి నాలుగు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుని వెళుతూ మత్తు పదార్థాల వినియోగం కేసులో ఇరుక్కుని అతని జీవితం నాశనం అయ్యేటట్లు చేసుకున్నాడన్నారు.

ఈ కార్యక్రమంలో వృద్ధ జనులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కామరాజు, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, చిలకలపూడి సిఐ అబ్దుల్ నబీ, దివ్య యోగ మందిర్ ఏపీ యోగ సభ గురువులు గురునాథ బాబు, చింతయ్య, సభ సభ్యులు యారా జగన్మోహన్రావు, పినిశెట్టి వేణుగోపాల్, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *