-పేరన్ దేవి , ఐఏఎస్ కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శి ,భారత ప్రభుత్వము ,న్యూ డిల్లీ
-ఈ కార్యక్రమము ఉద్దేశ్యం – రైతులలో చైతన్యం కోసం *) నూతన వ్యవసాయ మరియు వైవిధ్య పద్ధతులను అవగాహన దిశగా ఈ కార్యక్రమం
-ఒకే దేశం – ఒకే వ్యవసాయం – ఒకే బృందం అనే నినాదం వికసిత్ కృషి కార్యక్రమం
-సుస్థిర ,లాభసాటి వ్యవసాయం పై పూర్తిస్థాయి అవగాహన పెంచుతున్న కార్యక్రమం .
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు 02/06/2025 సోమవారం గుంటూరు జిల్లా లోని మంగళగిరి మండలం లోని నూతక్కి గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఖరీఫ్ సీజన్ సన్నద్ధత – వికసిత కృషి సంకల్ప అభియాన్ 2025 కార్యక్రమములో పేరందేవి ఐఏఎస్ కేంద్ర వ్యవసాయ సంయుక్త కార్యదర్శి, భారత ప్రభుత్వం,న్యూ డిల్లీ వారు పర్యవేక్షకులుగా ఈ కార్యక్రమ అమలు తీరు ,రైతులతో చర్చకు మరియు రైతుల ప్రతిస్పందనలను తెలుసుకోవటానికి నూతక్కి గ్రామాన్ని సందర్శించారు .గ్రామ రైతులతో జరిపిన పరస్పర చర్చలో వారు మాట్లాడుతూ మే నెల 29 న ఒరిస్సా రాష్ట్రంలోని పూరి లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రైతులు అత్యంత ఉత్సాహంగా , స్వచ్చదముంగ పాల్గొంటూ ,అధికారులు ,శాస్త్రవేత్తలతో అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారని తెలిపారు . ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు అధ్యక్షత వహించారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎక్స్ అఫిషియో బుడితి రాజశేఖర్ ఐఏఎస్ ,కేంద్ర వ్యవసాయ డిప్యూటీ సెక్రటరీ అనూప్ సింగ్ ,ఉద్యాన సంచాలకులు శ్రీనివాస్ అడిషనల్ డైరెక్టర్ విజయ లక్ష్మీ ,అనుబంధ శాఖల విభాగం అధిపతులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమం లో రైతులతో జరిపిన పరస్పర చర్చలో రైతులకు వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచే కొత్త వంగడాలు, భూసార పరీక్ష, ప్రకృతి వ్యవసాయం, పశు పోషణ, ఈ – నామ్ మార్కెటింగ్ తదితర విషయాల గురించి రైతులనుండి సమాచార సేకరణ ,వారికి కావలసిన వివిధ అంశాలను తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పతులను నిలువ చేసుకునే వీలుగా ప్రతి గ్రామంలో గిడ్డంగులు ప్రభుత్వం వారిచే ఏర్పాటు చేయవలసినది గా కోరారు. అరటి టిష్యూ కల్చర్ ద్వారా ఇప్పుడున్న పిలకల ఉత్పత్తి సామర్ధ్యం ఒక లక్ష నుండి గరిష్టంగా పెంచాలని కోరారు .అన్ని పంటలకు సరి అయిన మార్కెటింగ్ సదుపాయలు ,విధానాలు కల్పించాలని కోరారు . సభలో వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు డ్రోన్, యంత్ర పరికరాలు, పచ్చి రొట్ట విత్తనముల పంపిణీ జరిగినది. డ్రోన్ పనిచేయు విధానంపై ప్రదర్శన మరియు వివిధ వ్యవసాయ, ఉద్యానవన వెటర్నరీ శాఖలు కేంద్ర రాష్ట్ర పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శనలను అధికారులతో కలిసి పరిశీలించారు .
తదుపరి మంగళగిరి కార్యాలయం నుండి వివిధ అనుబంధ శాఖల అధికారులతో హైబ్రిడ్ పద్ధతిలో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు .డిల్లీ రావు మాట్లాడుతూ దేశములో ఎక్కడ లేని విధముగా వ్యవసాయంలో డిజిటల్ విధానము ద్వారా రైతులకు మెరుగైన పారదర్శకమైన సేవలను అందించే విధముగా అన్ని విభాగములలో యాప్ లను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు ,వాటిలో రైతు రికార్డుల APAIMS – ఏపీ ఎయిమ్స్ యాప్, వ్యవసాయ యాంత్రీకరణ లోనీ ఎఫ్ యం FM ఆప్, వ్యవసాయ బీమా పథకం లో ఉపయోగబడే పంట కోత ప్రయోగాలలో SST యాప్ మరియు ఈ పంట యాప్ చాలా ప్రామాణికంగా నిలిచాయన్నారు .
డిల్లీ రావు రాష్ట్రములో పర్చూరు ప్రాంతములోని HD బ్లాక్ బర్లీ పొగాకును కొనుగోలు దారులు ముందుకు రాక ,రైతులు అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ,ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి ,పరిష్కరించాలని కోరారు
Prajavartha Online Telugu News