Breaking News

న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలో ఘ‌నంగా స్వాత్రంత్ర దినోత్సవ వేడుక‌లు…

-జాతీయ జెండాను ఆవిష్కరించిన మేయ‌ర్
-న‌గరపాలక సంస్థ జెండాను అవిష్క‌రించిన‌ కమిషనర్
-పేదరిక నిర్మూలనకు కృషి చేద్దాం…
-న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ స్వాత్రంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
-ఆర్థిక, విద్యా, ఉపాధి రంగ‌ల్లో అభివృద్ది సాధించాలి- మేయ‌ర్
-ప్ర‌తి పౌరుడు స్వతంత్ర సమరయోధుల‌ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి
-కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంద‌రికీ సంక్షేమ‌, అభివృద్ది జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని, ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేద్దాం అని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. భారతదేశ 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో న‌గ‌ర మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి, కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, డిప్యూటి మేయ‌ర్లు బెల్లం దుర్గ‌, ఆవుతు శ్రీ‌శైల‌జా రెడ్డి, ఫ్లోర్ లీడ‌ర్ వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌, బొయి స‌త్య‌బాబు, పలువురు కార్పొరేట‌ర్లతో క‌లిసి మేయర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

తొలుత మేయ‌ర్, కమీషనర్ అధికారులతో కలసి గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంత‌రం నగరపాలక సంస్థ జెండాను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్  ఎగురవేసారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అర్హులైన వారందరికీ అందేలా అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. అంద‌రికీ ఆరోగ్య‌, ఉపాధి, పారిశుధ్యం, తాగునీరు అందించేలా కృషి చేయాల‌న్నారు. అదే విధంగా న‌గ‌రంలో చాలా మందికి బి.పారం ప‌ట్టాల విష‌యంలో అల‌స్యం జ‌ర‌గ‌కుండా వారికి న్యాయం చేస్తాన్నారు. అంద‌రికీ ఇల్లు అనేది వైసీపీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం అన్నారు. అందుకు అనుగుణంగా పేద‌వాడి సొంత ఇంటి క‌ల‌ను నిజం చేసేందుకు అధికారులు, సిబ్బంది నిర్ధేశించిన గ‌డువు లోగా వారి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ అందరికి స్వాత్రంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ స్వాత్రంత్ర సాధన కొరకు ప్రాణాలు అర్పిoచిన మహానుభావులు మనం స్మరించుకోవలసిన ఆవశ్యకత మనందరిపై ఉన్నదన్నారు. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విపత్కర పరిస్థితులలో తమ సేవలను అందిస్తున్న వారిని గౌరవించవలసిన కర్తవ్యం మనందరి భాద్యత అని అన్నారు. అనంత‌రం న‌గ‌ర పాల‌క సంస్థ నందు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 58 మంది అధికారులు, సిబ్బందికి న‌గ‌ర పాల‌క సంస్థ హైస్కూల్ చెందిన ఐదుగురు టీచ‌ర్లు, 7 గురు విద్యార్థుల‌కు ప్రశంసాపత్రములను మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్ అందించారు.

కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ‌, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, ఇతర విభాగముల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, ప్రశంసా పత్రములు పొందిన పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *