Breaking News

ప్రతి కుటుంబంలో ఒకరు ఎంటర్ పెన్యూర్ గా ఎదగాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని వెలుగు మహిళా సంఘాల సభ్యుల వార్షిక క్రెడిట్ మరియు జీవనోపాధి ప్రణాళిక MCP Preparation విధానాన్ని క్షేత్రస్థాయి నందు పరిశీలన చేయుటకు సెర్ప్ అడిషనల్ సీఈఓ రాములు నాయుడు తిరుపతి జిల్లా కు విచ్చేసి జిల్లాలోని రేణిగుంట మండలం నందు గాజుల మండ్యం గ్రామ సమాఖ్య 4 మీటింగ్ కి హాజరై సభ్యులతో మాట్లాడుతూ సభ్యుల జీవనోపాధి అవసరమేరకు ఏ నెలలో ఎంత మొత్తం రూపాయ లు పొంది ప్రతి కుటుంబంలో ఒకరు ఎంటర్ పెన్యూర్ గా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం సంఘం సభ్యులకు ఒక సంవత్సర కాలంలో జీవనోపాధులకు మరియు సొంత అవసరాలకు కావలసిన ఋణాలు ప్రణాళిక చేయడం వల్ల కలిగే ఉపయోగాలను వివరంగా అవగాహన కల్పించారు. ఇండియన్ బ్యాంక్ మైక్రోసాట్ తిరుపతి బ్రాంచ్ విజిట్ చేసి సంఘాలకు రుణాలు మంజూరు చేయుటలో బ్యాంకు మేనేజర్ లాగిన్ MCP Approval మరియు Download చేసి గ్రౌండ్ంగ్ చేయుట లో మేనేజర్ లాగిన్ లో ఉన్న సమస్యలను తెలుసు కొని ఆ సమస్యలను తొందర గా పరిష్కారం చేయిస్తాం.మహిళలకు విరివిగా వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి పారిశ్రామిక, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు సహాకారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా సిబ్బంది, మండల సిబ్బంది పాల్గొన్నారు. Pd drda TN Sobhan Babu, శ్రీ రాములు నాయుడు కి స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *