-జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 08 న జరగనున్న UPSC- ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2025 నిర్వహణ కు పగడ్భందీగా ఏర్పాట్లు చేయడమైనదని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తెలియజేసారు. జిల్లాలో మొత్తము 2 పరీక్ష కేంద్రాలలో 791 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. UPSC- ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2025 పరీక్షల నిర్వహణకు సంబంధించిన లైసన్ అధికారులు మరియు సంభందిత అదికారులతో శుక్రవారం మధ్యాహ్నము కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సమీక్ష సమావేశము నిర్వహించారు. UPSC- ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2025 పరీక్షలు పేపర్ -1 ఉ. 09:30 గంటల నుంచి ఉ. 11:30 గంటల వరకు, పేపర్ -2 మ. 2.00 గం.ల నుండి సాయంత్రం 05.00 గం. ల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతి ఒక్క అభ్యర్ధి తప్పని సరిగా గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని లేనిచో పరీక్ష కేంద్రానికి అనుమతించబోమని సూచించారు.
పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, వైర్లెస్ హెడ్ సెట్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని, పరీక్షా కేంద్రాల వద్ద పోలిస్ బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసి బస్సు సౌకర్యం, విద్యుత్ అంతరాయం లేకుండా సంబందిత శాఖల అధికారులు చూడాలని, త్రాగు నీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, అభ్యర్థుల సౌకర్యార్ధం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టిసి వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
Prajavartha Online Telugu News