Breaking News

పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు

-అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఏర్పాటు చేసిన డీఎస్సీ పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తిరుపతి పట్టణంలోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వెంకటాపురం నందు ఉదయం 9. 30 గంటలకు ప్రారంభమైన డీఎస్సీ పరీక్షల నిర్వహణ సరళిని, పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. జిల్లాలో డీఎస్సీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు లను పరిశీలించి పలు సూచనలు చేశారు.. వేసవి ఎండల దృష్ట్యా డీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థలు ఎటువంటి అస్వస్థకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావులేకుండా పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని పరీక్షల నిర్వహణ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూచించారు. కలెక్టర్ గారి వెంట జిల్లా విద్యాశాఖాధికారి కె వి యన్ కుమార్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *