గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సండ్రీస్ మార్కెట్ చెత్త ఆస్కారం లేకుండా, ఆస్కారం కల్గిన పండ్లు దిగుమతి చేయు వారి నుండి ఆసీలు రుసుం వసూళ్లు చేసుకునే హక్కు కల్గిన టెండర్ దారు నిర్దేశిత గెజిట్ లోని నిబందనలు పాటించనందున తన రుసుం వసూళ్లు చేసుకునే హక్కును ఈ నెల 4వ తేదీ నుండి రద్దు పరచడం జరిగిందని, పండ్ల దిగుమతి వ్యాపారులు ఆసీలు రుసుంను జిఎంసి రెవెన్యూ సిబ్బందికే చెల్లించాలని, అలాగే నగరంలో తోపుడు బండ్ల వారు ఎవ్వరికీ ఆసీలు ఇవ్వాల్సిన అవసరం లేదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సండ్రీస్ మార్కెట్ చెత్త ఆస్కారం లేకుండా, ఆస్కారం కల్గిన పండ్లు దిగుమతి చేయు వారి నుండి ఆసీలు రుసుం వసూళ్లు చేసుకునే హక్కు పొందిన కాంట్రాక్టర్ షేక్ షంషీర్ నిర్దేశిత పరిధిదాటి తోపుడు బండ్లు, తాటి ముంజలు, బొప్పాయిలు, జామ కాయలు, ఈత కాయలు అమ్మే వారి నుండి కూడా ఆసీలు వసూళ్లు చేస్తున్నారన్నారు. అలాగే కేటాయించబడిన హిమని స్వీట్ షాప్ నుండి సండ్రీస్ పండ్ల మార్కెట్ వరకు వచ్చే చెత్తను సదరు కాంట్రాక్టరే తన స్వంత ఖర్చులతో పొత్తూరులోని డంపింగ్ యార్డ్ కి తరలించాల్సి నిబందన ఉన్నా తరలించడం లేదని అందిన ఫిర్యాదులను విచారించగా తరలించడం లేదని నిర్ధారణ జరిగిందన్నారు. సదరు కాంట్రాక్టర్ గుంటూరు నగరపాలక సంస్థ 2025-26 సంవత్సరం గెజిట్ నిబందనల మేరకు నిర్దేశిత అమౌంట్ కి సంబందించి ముందస్తు చెల్లుబాటు అయ్యే చెక్ లను, లీజు అగ్రిమెంట్ రిజిస్టర్ చేయించి జిఎంసికి అందించనందున వారికి కేటాయించిన రుసుం వసూళ్లు చేసుకునే హక్కును ఈ నెల 4వ తేదీ నుండి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. నగరంలో తోపుడు బండ్ల వారు ఎవ్వరికీ ఆసీలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా వసూళ్లు చేస్తే జిఎంసి కాల్ సెంటర్ 08632345103 కి ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Prajavartha Online Telugu News