Breaking News

అన్న క్యాంటీల్లో శని, ఆదివారాలలో ఆహారం అందుబాటులో ఉండదు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 7, 8 తేదీల్లో బక్రీద్ పండుగ, ఆదివారం వరుసగా వచ్చినందున, సెంట్రల్ వంటశాలను శుభ్ర పరచడం, సర్వీసింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు అన్నా క్యాంటీన్లను మూసివేస్తున్నారని, తిరిగి సోమవారం క్యాంటీన్లు యధావిధిగా అందుబాటులో ఉంటాయని అక్షయ పాత్ర ప్రతినిధులు తెలిపారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్షయ పాత్ర సెంట్రల్ వంటశాలను శుభ్ర పరచడం, సర్వీసింగ్ చేస్తున్నందున గుంటూరు నగరంలో 7 అన్న క్యాంటీల్లో శని, ఆదివారాలలో ఆహారం అందుబాటులో ఉండదన్నారు. కనుక నగర ప్రజలు గమనించాలని, సోమవారం నుండి యధావిధిగా పని చేస్తాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *