గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లల్లో ఆహారం కోసం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని, అందుకు తగిన విధంగా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా అక్షయ పాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. కమిషనర్ గురువారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, టిఫిన్ చేసి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించి, మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే క్యాంటీన్లలో అందించే ఆహారంపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేలా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ లను స్కాన్ చేయడం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చన్నారు. క్యాంటీన్లలో లైట్లు, ట్యాప్ ల రిపేర్ ఉంటె ఎప్పటికప్పుడు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News