-విద్యార్ధి, యువజన,మహిళ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
-తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహాం వద్ద భారీ నిరసన
-మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను ప్రోత్సహిస్తున్నందుకు వ్యతిరేకంగా పశ్చిమ నియోకవర్గంలోని విద్యార్ధి, యువజన, మహిళ సంఘాలు శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వున్న అంబేద్కర్ విగ్రహాం ముందు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
సాక్షి పత్రిక, టీవీ ఛానెల్ అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు , మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయిస్తున్న వైసిపి అధినేత ఎమ్మెల్యే జగన్, సాక్షి మీడియా నిర్వహాకురాలు వై.ఎస్.భారతి రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ విద్యార్ధి, యువజన, మహిళ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అధికారం కోల్పోవటంతో ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆరాచక శక్తుల్ని పెంచి పోషిస్తున్నాడంటూ మండిపడ్డారు. మహిళలకు గౌరవం ఇవ్వటం తెలియని కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సంస్కారం లేని వ్యక్తులకు
వ్యక్తి బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే జగన్ కి సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమిలో సుపారిపాలన కొనసాగుతున్న ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించటానికి జగన్ ప్రయత్నించటం చాలా బాధకరమన్నారు. సాక్షి ఛానెల్ డిబెట్ లో వ్యాఖ్యలు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలందరూ గత ప్రభుత్వంలో జగన్ వైఖరి నచ్చక 11 సీట్లకే పరిమితం చేశారని, జగన్, వై.ఎస్.భారతి రెడ్డి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ఆత్మాభిమానం గల మహిళలుగా అందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుఖాసి సరిత, సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, టి.ఎన్.ఎస్.ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సాయిచరణ్ యాదవ్, తెలుగు యువత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నాగుర్ బాబు, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అద్యక్షుడు ఆర్.మాధవ, తెలుగు మహిళ నాయకురాలు షేక్ గౌసియా,షేక్ నసీమా,లక్ష్మీ, నందకుమారి,కె.సరిత,మాదల సత్య, తెలుగు యువత విద్యార్ధి నాయకులు దాడి మురళీ, రాంబాబు, జాహీద్, సంతోష్, హనుమంతురావు, నందం భవానీ ప్రసాద్, సురభి బాలు లతో పాటు విద్యార్థి,యువజన మహిళ సంఘ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News