విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ను శుక్రవారం వ మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సి.హెచ్.శంకరరావు, ఎంపి కేశినేని శివనాథ్ కు పుష్పంగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు ఎంపీ కేశినేని శివనాథ్ వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ సెక్రటరీ ఎమ్.లీల, ఎపి స్టేట్ జనరల్ సెక్రటరీ జి.ఎన్.శ్రీనివాసరావు, ఎ.డి.ఎస్. కె.పాములు, హూడా మాజీ ఛైర్మన్ తుమాటి ప్రేమనాథ్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News