Breaking News

మౌళిక వసతుల పై దృష్టి సారించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మౌళిక వసతులైన రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేపట్టడానికి ఏఈల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ప్రాధాన్యత క్రమంలో చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ గోరంట్ల, కోదండరాం నగర్, నగరాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ఏఈల వారీగా ఆయా ప్రాంతాల్లో ముఖ్యమైన మౌళిక వసతులైన రోడ్లు, డ్రైన్ల, త్రాగునీటి పైప్ లైన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ప్రాంతంలో సిసి రోడ్లు కాకుండా తొలుత ప్రజల రాకపోకలకు వీలుగా జిఎస్బీ రోడ్లను డ్రైన్లతో కలిపి ప్రతిపాదించాలన్నారు. కోదండరాం నగర్ స్థానికులు అందించిన ఫిర్యాదు మేరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించి, పారిశుద్యం, మౌలిక వసతులను పరిశీలించి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల నుండి అందే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం పారిశుధ్య పనులపై ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరిగితే రోడ్ల మీద, ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు ఉండవన్నారు. పర్యటనలో డిఈఈ శ్రీనివాస్, ఎస్ఎస్ సోమశేఖర్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *