Breaking News

అన్నక్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని, క్యాంటీన్లలో ఆహార సరఫరాకి నిర్దేశిత సమయాన్ని పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. కమిషనర్ శుక్రవారం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించి, మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు నిర్దేశిత సమయంలో ఆహారం అందించేలా, క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అక్షయపాత్ర సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. క్యాంటీన్లలో శుభ్రమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *