
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్షులు బి.షణ్ముఖ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శంకర్రావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లపై తీవ్రమైన పని భారాన్ని పంచాయతీరాజ్ శాఖలోని ఎనిమిది ఇంజనీరింగ్ శాఖల పనులను ఇంజనీర్ అసిస్టెంట్ లపై ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు. ఒక ఇంజనీర్ అసిస్టెంట్కు ఒక శాఖ మాత్రమే కేటాయించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే తమ సమస్యలపై పలుమార్లు మంత్రులను అధికారులను కలిసి విన్నవించిన పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పదోన్నతులు కల్పించాలన్నారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో 26 జిల్లాల నుండి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News