-ముఖ్యఅతిథులుగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తనయుడు కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డూండి గణేష సేవాసమితి ఆధ్వర్యంలో లేబర్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేయనున్న 72 అడుగల మహా మట్టి గణపతి విగ్రహ ఏర్పాటుకు సోమవారం జరిగిన శంఖుస్థాపన మహోత్సవానికి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తనయుడు కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వీరికి డూండీ గణేష సేవాసమితి వ్యవస్థాపన అధ్యక్షుడు డూండీ రాకేష్ తో పాటు కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం 72 అడుగల మహా మట్టి గణపతి విగ్రహ ఏర్పాటుకు కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్ పూజ కార్యక్రమాలు నిర్వహించిన కొబ్బరికాయులు కొట్టి శంకుస్థాపన చేయటంతోపాటు షెడ్డు నిర్మాణానికి కర్ర పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తనయుడు కేశినేని వెంకట్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన అమరావతి రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆ విఘ్నాధిపతి కాపాడాలని , రాష్ట్ర ప్రజలందరిపై ఆ మహా గణపతి ఆశీస్సులు వుండాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా 72 అడుగల మహా మట్టి గణపతి విగ్రహం రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయటం ప్రజలందరి అదృష్టమన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం లో సినీ నటుడు సుమన్ తో కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా వుందన్నారు. వినాయకచవితి కి అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా వున్నారని తెలిపారు.
అనంతరం సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని మించిన ఎత్తులో మట్టి తో వినాయక విగ్రహాం తయారు చేయటం చాలా గొప్ప విషయమన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మట్టితో మహా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నందుకు డూండి గణేష సేవాసమితికి అభినందనలు తెలిపారు.
ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డూండి గణేష సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డూండీ రాకేష్ మాట్లాడుతూ గతంలో 63 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, గత నాలుగేళ్లుగా 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహాన్నిఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం త్వరగా పూర్తిగా ఆ అభివృద్దిను ప్రజలందరూ అందుకోవాలనే ఆకాంక్షతో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహానికి భూమి పూజ శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా వుందన్నారు.అతిధులుగా విచ్చేసిన కేశినేని వెంకట్, సినీనటుడు సుమన్ కి కృతజ్ఞతలు తెలిపారు. మహామట్టి గణపతి పోస్టర్ లాంచ్ కార్యక్రమం త్వరలోనే వుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో డూండి గణేష సేవాసమితి కమిటీ సభ్యులు గడ్డం రవి, పేర్ల రవి, ముక్తేశ్వరరావు, డి.సుబ్బారావు, చైతన్య, నాగేశ్వరరావు, శ్రీనివాస్, సత్యనారాయణ, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, డివిజన్ అధ్యక్షులు శివశర్మ, పేరం సత్యనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు రేగళ్ల లక్ష్మణారావు లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News