Breaking News

డ్రోన్ల వినియోగం రైతులకు ఒక వరం లాంటిదని వాటిని సద్వినియోగం చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం రైతులకు ఒక వరం లాంటిదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మోపిదేవి మండలానికి చెందిన ఇరువురు రైతులకు దాదాపు పది లక్షల రూపాయల విలువచేసే డ్రోన్లను 80 శాతం రాయితీతో అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు 80 శాతం రాయితీతో డ్రోన్లను సరఫరా చేస్తుందన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయడం చాలా అనుకూలమైందన్నారు. ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని ద్రవరూపం లో డ్రోన్ల ద్వారా చాలా తొందరగా తక్కువ సమయంలో పొలంలో పంటకు వెదజల్ల వచ్చన్నారు. గతంలో రసాయనాలు వెదజల్లాలంటే ఎకరాకు 1000 రూపాయలు ఖర్చవుతుండేదని, నేడు డ్రోన్ల ద్వారా కేవలం 200 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. ఆ ప్రకారం 80 శాతం ఖర్చు ఆదా అవుతుందన్నారు.

జిల్లాలో 32 మంది రైతు సంఘాలకు డ్రోన్లు మంజూరు చేశామని అందులో 15 సంఘాలు ముందుకు వచ్చి పైకం చెల్లించాయని, అందులో రెండు సంఘాలకు నేడు డ్రోన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డ్రోన్ల విలువ 9.80 లక్షలు రూపాయలు అవుతుందని అందులో 80 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. రైతులు తమ పొలంలో డ్రోన్ వినియోగించుకున్నాక ఇతర గ్రామాల్లో అవసరాలకు అద్దెకు ఇచ్చుకోవచ్చన్నారు. ఆ ప్రకారం వారికి అదనపు ఆదాయం కూడా లభిస్తుందన్నారు. కూలీలు దొరకడం కష్టమవుతున్న ఇటువంటి సమయంలో ముఖ్యంగా వరి పండించే రైతులకు డ్రోన్లు గొప్ప వరమన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ డ్రోన్ గాలిలోకి ఎగిరి ఎలా పని చేస్తాయో ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్ రావు, ఏడి మణిధర్, వ్యవసాయ అధికారి రామ్ కుమార్, హారిక, శ్రీ విఘ్నేశ్వర రైతు సంఘం మెరకనపల్లి రైతు ప్రదీప్, శ్రీ ఆంజనేయ రైతు సంఘం కోసూరు వారి పాలెం రైతు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *