Breaking News

యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం/ఘంటసాల/చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాలు మొదలై వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపధ్యంలో డ్రైనేజీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ 216 జాతీయరహదారి వెంబడి ప్రయాణిస్తూ మచిలీపట్నంలోని సత్య కన్వెన్షన్ వద్ద శివగంగ, ఘంటసాల మండలంలోని ఐనంపూడి ప్రధాన డ్రెయిన్, అదేవిధంగా చల్లపల్లి మండలంలోని గుండేరు ప్రధాన డ్రైనేజీలను పరిశీలించారు. అధిక వర్షాలు కురిసినపుడు ముంపుతో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందుగానే మురుగు కాలువల్లోని గుర్రపుడెక్క, తూడు, కిక్కిస వంటి కలుపును తక్షణం తొలగించాలని అధికారులకు సూచించారు. ముందుగా ప్రాధాన్యత కలిగిన సాగునీటి మురుగు కాలువలకు పనులను పూర్తి చేయాలని, తర్వాత మిగిలిన డ్రెయిన్ల పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పులిగడ్డ అక్విడెక్ట్ వద్దకు చేరుకుని అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. అక్విడెక్ట్ కు రెయిలింగ్, ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ ఎస్ఈ మోహన్ రావు, కేసి డివిజన్ ఈఈ రవి కిరణ్, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *