విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాల మేరకు గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నగరంలో జరుగుతున్న సర్వే స్థితిగతులను సమీక్షించారు. ఈ సర్వేలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని ఖాళీ స్థలాలు, ఖాళీ స్థలాలుగానే ఉన్నాయా లేదా వాటి పైన ఇల్లు నిర్మించారా, ఒకవేళ ఇళ్లను నిర్మిస్తే వాటికి తగ్గట్టుగా ఖాళీ స్థలాల పన్నును ఇంటి పన్నుకి మార్చాలని, ఇంటి పన్నులు ఉన్న అసెస్మెంట్లకు నగరపాలక సంస్థ జారీ చేస్తున్న డిమాండ్ కు తగ్గట్టుగా ఉందా లేదా, ఒకవేళ అదనముగా రూములు నిర్మించిన, ఫ్లోర్లు నిర్మించిన, ఆ మార్పుకు తగ్గట్టుగా పన్నును ఈ సర్వే ద్వారా మార్చాలని అన్నారు. అడ్మిన్ సెక్రటరీలు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి కచ్చితంగా ఈ సర్వేను పూర్తి చేయాలని అన్నారు. అలాగే ప్రజలు కూడా సిబ్బంది తమ వద్దకు వచ్చినప్పుడు సహకరించాలని, పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్లు హెలెన్, బి. శ్రీనివాసరావు, ఏ యూ బి శర్మ, రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు .
Prajavartha Online Telugu News