Breaking News

చెత్త శుద్ధితో సంప‌ద సృష్టికి చిత్త శుద్ధితో ప‌నిచేయండి..

– ఎస్‌డ‌బ్ల్యూపీసీ కేంద్రాల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి
– రూ. 10కే కిలో వ‌ర్మీ కంపోస్టును రైతుల‌కు అంద‌జేయండి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి ప‌ట్టుగొమ్మ‌లైన ప‌ల్లెల‌ను ప‌రిశుభ్ర‌త‌కు నెల‌వులుగా మార్చేందుకు, చెత్తను స‌ర్య్యుల‌ర్ ఎకాన‌మీకి చోద‌క‌శ‌క్తిగా మార్చి గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసే ల‌క్ష్యంతో ఏర్పాటుచేసిన చెత్త నుంచి సంప‌ద సృష్టి కేంద్రాల (ఎస్‌డ‌బ్ల్యూపీసీ)ను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయి అధికారుల‌ను ఆదేశించారు.
గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కంచిక‌చ‌ర్ల‌లో ఎస్‌డ‌బ్ల్యూపీసీ షెడ్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. కేంద్రం కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ చెత్త స‌మ‌స్య‌ను స‌రైన విధంగా ప‌రిష్క‌రించడంతో పాటు ఘ‌న వ్య‌ర్థాల స‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌తో సంప‌ద‌ను సృష్టించేందుకు ఎస్‌డ‌బ్ల్యూపీసీలు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌న్నారు. స్వ‌చ్ఛాంధ్ర‌-స్వ‌ర్ణాంధ్ర సాకారానికి కీల‌క‌మార్గ‌మైన త‌డి, పొడి చెత్త‌ల‌ను విడివిడిగా సేక‌రించ‌డం.. సేంద్రియ వ్య‌ర్థాల నుంచి వ‌ర్మీ కంపోస్టును త‌యారుచేయ‌డం ద్వారా సంప‌ద సృష్టి జ‌రుగుతోంద‌న్నారు. వ్య‌ర్థాల‌ను స‌రైన విధంగా పారిశుద్ధ్య సిబ్బందికి అంద‌జేయ‌డంతో పాటు వ‌ర్మీ కంపోస్టును ఉప‌యోగించ‌డం ద్వారా ఆరోగ్య‌క‌ర వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు సాధించ‌వ‌చ్చ‌నే విష‌యంపై అవ‌గాహ‌న పెంపొందించాల‌న్నారు. జిల్లాలోని 286 గ్రామ పంచాయ‌తీల్లో 264 షెడ్లు క్రియాశీలంగా ప‌నిచేస్తున్నాయ‌ని.. కిలో రూ. 10కు వ‌ర్మీ కంపోస్టును రైతుల‌కు అంద‌జేయాల‌ని ఆదేశించారు. బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలున్న టెర్ర‌స్ కిచెన్ గార్డెన్‌ల‌ను చేప‌ట్టేలా, వాటికి వ‌ర్మీ కంపోస్టును ఉప‌యోగించుకునేలా కూడా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. చెత్త నుంచి సంప‌ద సృష్టి కేంద్రాల‌తో అనుసంధానించే ర‌హ‌దారులు స‌రైన విధంగా ఉండేలా చూడాల‌న్నారు. విక‌సిత్ భార‌త్‌, సుసంప‌న్న, ఆరోగ్య‌, స్వ‌ర్ణాంధ్ర సాకారానికి స్వ‌చ్ఛ‌తా మార్గం కీల‌క‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో ఎస్‌డ‌బ్ల్యూపీసీ కేంద్రాల నిర్వ‌హ‌ణ‌లో జిల్లాను నెం.1గా నిలిపేందుకు క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. క‌లెక్ట‌ర్ వెంట నందిగామ ఆర్డీవో కె. బాలకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో ఏసుబాబు త‌దిత‌రులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *