-డిల్లీ రావు ఐఏఎస్. వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్
-అన్నదాత సుఖీభవ పథకం నకు గ్రీవెన్స్ మాడ్యులు – ఫిర్యాదుల విభాగం రేపు విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కు సంబంధించి ల్యాండ్ మాడ్యూల్స్ లో గ్రామ స్థాయిలో ఎదురయ్యే వివిధ రెవెన్యూ అంశాలపై క్షేత్ర స్థాయిలోనీ వ్యవసాయ అధికారులు సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలని డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు తెలియచేశారు .క్షేత్ర స్థాయిలో గ్రామం మొత్తంగా పరిష్కారం కానీ RoR రెవెన్యూ రికార్డులు ,
1 బి లో లేని గ్రామాలు ,
మునిసిపాలిటీ లలో కలవటం వల్ల వెబ్లాండ్ లో లేని గ్రామాలు ,
భూముల రీసర్వే వల్ల పరిష్కారం కానీ గ్రామాలు ,
ఎస్టేట్ మరియు ఇనామ్ భూముల రద్దు చట్టం పరిధిలోని గ్రామాలు
సొసైటీ భూముల నోషనల్ ఖాతాలు తదితర అంశాలపై మరియు
వెబ్లాండ్ లో ఏర్పడుతున్న కొన్ని ప్రతిబంధకాలను ప్రస్తావిస్తూ
ఖాతాదారు బ్రతికే ఉన్నా, ఆధార్ తప్పుగా వెబ్‌ల్యాండ్ 1.0 మరియు 2.0లో నమోదు అయ్యిన నేపథ్యం లో,
1) ఖాతాదారు నిజంగా బ్రతికే ఉన్నా, వారి ఆధార్ నంబర్ తప్పుగా లేదా మరొకరి ఆధార్ నంబర్‌ను వెబ్‌ల్యాండ్ 1.0 మరియు 2.0 రెండింటిలోనూ పొందుపరిచటమ్ వల్ల ,
అన్న దాత పీఎం కిసాన్ లాంటి పథకాలలో అనర్హత ఏర్పడుతుంది.
డేటా ఎంట్రీలో – సమాచార నమోదులో పొరపాటు లేదా వెబ్‌ల్యాండ్ మార్పిడి సమయంలో ఆధార్ మ్యాపింగ్ లో లోపం కారణముగా జరిగిన ఈ సమస్యకు పరిష్కారం గా
ఆధార్ సవరణకు అవకాశం కలిగిన మాడ్యూల్ ద్వారా, ఫీల్డ్‌లో ధృవీకరణ చేసి వెబ్‌ల్యాండ్‌లో సవరణ చేయాలి.
2) .క్రియాశీలకంగా లేని ఖాతాదారులు (సరైన లేదా తప్పుగా ఆధార్ పొందుపరిచినవారు) ల అంశమును పరిశీలిస్తే —
మరణించిన ఖాతాదారులు ఇంకా వెబ్‌ల్యాండ్‌లో ప్రత్యక్షమవుతుండటం. వీరిలో కొందరి ఆధార్
ఖాతాదారు స్వంతంగా ఉండటం
మరియు ఇతరుల ఆధార్ ఉండటం వల్ల సమస్య ఎదు రవడం వల్ల మ్యుటేషన్
లలో వారసత్వ మార్పులు చేసుకునేందుకు ఆటంకం ఏర్పడటం వల్ల ప్రభుత్వం నుండి ప్రయోజనాల లబ్ధిలో సమస్యలు ఏర్పడుతున్నాయి
ఇటువంటి వాటికి పరిష్కారం గా
ఫీల్డ్‌లో మరణ ధృవీకరణ జత చేసి, వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్ ద్వారా ఖాతా మార్చాలి.
3) . నోషనల్ ఖాతాలు (Notional Khatas) – ప్రధానంగా వెబ్‌ల్యాండ్ 1.0 లో
A )పట్టా భూమి ఖాతాదారులకు కేటాయించకపోవడం — మిగులుగా చూపడం .
పట్టా భూమిని ఎవరి ఖాతాకి కేటాయించకుండా మిగులు భూమిగా చూపడం.
B) 1 లక్ష సిరీస్‌లో ఖాతాలు ఉండి ఆధార్ ను పొందుపరచకపోవడం
ఆధార్ లింక్ లేకపోవడం వల్ల, లబ్దిదారుల గుర్తింపు సాధ్యం కాకపోవడం జరుగుతుంది .
C) ఆటో మ్యూటేషన్ గ్రామాలలో 5000+ సిరీస్ ఖాతాలు – ఫీల్డ్ సిబ్బంది నోషనల్‌గా భావించే అవకాశం ఉండటం
ఆటోమేటెడ్‌గా వచ్చిన సిరీస్ ఖాతాలను కొన్ని సందర్భాల్లో ఫీల్డ్ సిబ్బంది తప్పుడు అర్థంతో నోషనల్‌గా పరిగణిస్తున్ననందున
D) సాంకేతిక లోపం వల్ల వాస్తవంగా భూమి ఉన్న ఎటువంటి భూమి లేని ఖాతాలు (Zero Extent)గా నమోదు అవ్వటం .
డేటా లోపాల వల్ల విస్తీర్ణమును చూపించకపోవడం
4) సొసైటీ భూములు – వ్యక్తిగత ఖాతాలలోకి మార్పు జరగక సొసైటీ భూములుగా ఉండటం వల్ల ఏర్పడిన సమస్య:
నాటి కాలంలో సమితుల (సొసైటీ) పేరుతో అప్పగించిన భూములు, ఇప్పటివరకు వ్యక్తుల ఖాతాల్లోకి మార్చబడలేదు.
ఇటువంటివి కొన్ని ప్రాంతాలలో ముఖ్యముగా
నెల్లూరు జిల్లా, కొద్ది భాగాలు గోదావరి జిల్లాలలో కనిపించే సమస్యగా పేర్కొనవచ్చు .
వీటి పరిష్కారం గా
సర్వే చేసి, వ్యక్తిగత ఖాతాల్లోకి మ్యూటేషన్ ప్రక్రియ ప్రారంభించాలి.
పైన పేర్కొన్నవి రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కనిపించే రెవెన్యూ సమస్యలు. వీటిపై క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులు క్షుణ్ణమైన అవగాహన కలిగివుండి ,రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉండాలి అని తెలిపారు .రైతులకు కూడా సమస్యను తెలపాలని, వారిలో అవ గాహన పెంచాలని సూచించారు.
Prajavartha Online Telugu News