Breaking News

రక్షణ కల్పించి న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు నేడు కార్యక్రమం పేరుతో కుచ్చుటోపి పెట్టారంటూ బాధితుడు కంచి రాజేష్ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో సోమవారం తన ఆవేద నను వెల్లడించారు. 25 లక్షల రూ పాయలను కాంట్రాక్ట్ కోసం నాలుగు ఐదు దఫాలుగా చెల్లించామని, ఒక రూపాయి మెటీరియల్ కూడా సప్లై చేయకుండా, 25 లక్షలు తీసుకొని ఇప్పుడు తిరిగి ఇవ్వక పోగా బాధితులనే బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన చెందారు. గత ప్రభుత్వంలో 2020, డిసెంబర్లో జరిగిన నాడు నేడు కార్యక్రమంలో వి సుదర్శన్ రెడ్డి, నాగార్జున అను ఇద్దరు వ్యక్తుల అక్రమాలకు పాల్పడ్డారన్నారు. తన భార్య పేరుతో రామవరప్పాడు లో ఉన్న ఈ సి ఓ క్లీన్ అండ్ కేర్ కంపెనీ నాడు నేడు కార్యక్రమంలో డిసెంబర్ 16 2020 నుండి జన వరి 10 2021 మధ్యలో గ్రీన్ చార్ట్ బోర్డ్ మెటీరియల్ సప్లై చేయుటకు కోటిన్నర కాంట్రాక్టును ఉల్చా సుదర్శన్ రెడ్డి కి చెందిన భారతి ఇన్ఫ్రా టెక్నాలజీస్ తాడేపల్లి కంపెనీ తో కాంట్రాక్టు కుదుర్చుకున్నామ న్నారు. ఈ కాంట్రాక్ట్ కోసం సుమారు 25 లక్షల రూపాయలను నాలుగైదు దఫాలుగా భారతీ ఇన్ఫ్రా టెక్నాలజీస్ తాడేపల్లి కంపెనీకి పేమెంట్ చేశామన్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి మెటీరియ ల్ను సప్లై చేయలేదన్నారు. అంతేకాకుండా తీసుకున్న నగదు కూడా తిరిగి ఇవ్వలేదు అన్నారు. అడిగితే అప్పుడు నాకు వైసిపి అండదండలు ఉన్నాయని, ఇప్పుడు నాకు టిడిపి అండదండలు ఉన్నాయని ఎక్కువ మాట్లాడితే నువ్వే నాకు పది లక్షలు ఇవ్వాలని లేకుంటే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. సుదర్శన్ రెడ్డి గతంలో వైసిపి పార్టీలో ఉన్నాడని ప్రస్తుతం కడప జిల్లాలో టిడిపి పార్టీకి ఎంపీటీసీగా ఉన్నాడన్నారు. ఈ విషయమై కమిషనర్ కార్యాలయంలో జనవరి 25లో స్పందన ద్వారా ఫిర్యాదు చేయగా కనీస చర్యలు కూడా తీసుకోలేదు అన్నారు. తనకు డబ్బులు ఇప్పించి తనకు న్యాయం చేయాలని బాదితుడు కంచి రాజేష్ కోరాడు. బి సుదర్శన్ రెడ్డి, నాగార్జునల నుండి తమకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయండని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *