Breaking News

వెటర్నరీ విద్యార్ధుల‌కు శుభ‌వార్త‌

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని గరివిడిలో ఉన్న ‘కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌’లో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు గానూ మూడవ, నాల్గవ సంవత్సరాల బీవీఎస్‌సీ, ఏహెచ్ (B.V.Sc, A.H) కోర్సులు పునరుద్ధరణ గురించి రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు చూపిన చొర‌వ వ‌ల‌న‌ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2022 సంవ‌త్స‌రం నుండి ఈ కోర్సుల‌కు అనుమ‌తి లేదు. వెంట‌నే కేంద్ర ప్ర‌భుత్వం స్పందించి సంబంధిత కోర్సులకు అనుమతులను పునరుద్ధరిస్తూ లేఖ‌ను విడుద‌ల చేశారు. మంగ‌ళ‌వారం కేంద్ర పశుసంవర్ధక & పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి లాల‌న్ సింగ్ ను క‌ల‌సి మ‌రిన్ని విష‌యాలు చ‌ర్చించి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *