Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 284 అర్జీలు

-పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ఆర్జీలకు మొదటి ప్రాధాన్యతతో ఆలస్యం చేయకుండా పరిష్కారం చూపాలి :
-జిల్లా ఇంచార్జ్ మంత్రి రెవిన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి
-జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఆలస్యం చేయకుండా నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పదంతో వ్యవహరించాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి రెవిన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ కలసి సంయుక్తంగా జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా ఇంచార్జ్ మంత్రి రెవిన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ కలసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయమునకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పిజిఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే మెడికల్ క్యాంపు, త్రాగునీటి సౌకర్యం, విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల కు వీల్ చైర్స్ ఏర్పాటు వచ్చిన అర్జీదారులకు ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారో పరిశీలించారు. ప్రతి కౌంటరు దగ్గరకు వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు . తరువాత ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో ప్రజల దగ్గర నుండి వారియొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. అందులో బాగంగా శ్రీమతి బారతి వైఫ్ ఆఫ్ ఆనంద్ అనే మహిళ మేము తిరుపతి ఐస్ మహల్ దగ్గర నివాసం ఉంటూన్నామని తెలిపారు. తన భర్త 24 జనవరి 2023 ప్రమాదవశాత్తు మృతిచెందారని మాకు 3 పిల్లలని తెలిపారు. మాకు ఎటువంటి ఆదాయం లేదన్నారు. ఆ సమయములో తన భర్తకు సంబంధించి చిగురువాడ, ఉత్తరపు కండ్రిగ సమీపములో ఉన్నటువంటి ప్లాట్ ను తన భర్త మరణించిన 4 వ రోజున వేరే వాళ్ళపై ప్లాట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారని, మేము ఎవరు ఎవరికీ ఎటువంటి రిజిస్టరు చేయకనే మర్సుకున్నారని ఆవేదనతో తెలియపరిచారు. గతంలో నారా లోకేష్ గారి దృష్టికి తెసుకొని వెళ్ళమని తెలిపారు అప్పుడు సంబందిత శాఖ వారికి ఆ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి న్యాయం చేయాలనీ ఆదేశించారని తెలిపారు. అప్పటి అధికారులు రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లుగా తెలిపారు కానీ మాకు న్యాయం జరగలేదు. కానీ వారి నుండి ఎటువంటి స్పందన లేదని తెలిపారు . ఎదురు చూడడం తప్ప ఏమి జరగలేదని వారి ఆవేదనను తెలియపరిచి తమకు ప్లాట్ వచ్చే విదంగా న్యాయం చేయాలనీ మంత్రి గారిని కోరారు. భారతి అనే మహిళా మాటలు విన్న మంత్రి మరియు కలెక్టర్ సంబందిత రిజిస్ట్రేషన్ అధికారిని పిలిచి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విబిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి తగిన న్యాయం చేస్తామని వారికీ తెలిపారు. అలాగే మిగిలిన వారి వద్ద నుండి అర్జిలను స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజిఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జిల్లా ఇంచార్జ్ మంత్రి రెవిన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ కలసి సంయుక్తంగా జిల్లా అధికారులను ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, రెవెన్యూ అధికారి జి నరసింహులు, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, సుధా రాణి, రోజ్ మాoడ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదు చేసి అర్జీదారులకు రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు :

రెవెన్యూ -149, పంచాయతీ రాజ్ -24, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ -3, సర్వే ల్యాండ్ రికార్డ్స్- 12, హోం శాఖ -13, సివిల్ సప్లైస్ -10, స్కూల్ ఎడ్యుకేషన్ -13, హయ్యర్ ఎడ్యుకేషన్ -1, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్-3, రూరల్ పావర్టీ -5, విద్యుత్ శాఖ-2, ఎ పి ఎస్ డబ్వ్లుఇ ఆర్ ఐ ఎస్ -28, ఏపీఐఐసి -1, సోషల్ వెల్ఫేర్- 4, మెడికల్ డిపార్టుమెంటు -1, పబ్లిక్ హెల్త్ -1, డి ఎం అండ్ హె ఓ -1, , ఏపీ స్కిల్ డెవలప్మెంట్ -1, ఆర్ అండ్ బి -1, జల వనరుల శాఖ -1, , మత్స్య శాఖ -1 నేషనల్ హైవే – 4, సమగ్ర శిక్ష -1, బి సి వెల్ఫేర్ -1, రూరల్ డెవలప్మెంట్ -3, మొత్తం 284 అర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు వచ్చిన అర్జీల పై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *