Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి

-రీ ఓపెన్ కి తావు లేకుండా ఆర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
-సీజనల్ వ్యాదులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
-ఈ నెల 10 న జరుగు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ను పండగ వాతావరణంలో నిర్వహించాలి
-పి -4 లో భాగంగా ప్రతి జిల్లా అధికారి ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి :
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా, రెవెన్యూ డివిజన్, అధికారులు,మునిసిపల్ కమీషనర్లు, తాహసిల్దార్లు,మండల తదితర అధికారులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలు పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. (PGRS) లో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారo చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. రీ ఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రతి సోమవారం అన్ని మండల పరిధిలో, డివిజన్ పరిధిలో తప్పని సరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం, సమయం అర్జిదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలన్నారు. అర్జీదారులు వారి సమస్యల పరిష్కారం కొరకు పీజీఆర్ఎస్ కు రావడం జరుగుతుందని సంబంధిత అధికారులు అర్జీ దారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానoగా విని సంతృప్త స్థాయిలో పరిష్కారo చూపాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ ఎ కు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను ఓపెన్ చేసి చూసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పి.జి.ఆర్.ఎస్ కు వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని సంబంధిత శాఖాధికారులను కలెక్టర్ హెచ్చరించారు.

మారుతున్న వాతావరణ పరిస్థితుల కనుగుణంగా సీజనల్ వ్యాదులు ప్రబలకుండా, పారిశుధ్య నిర్వహణ లోపం లేకుండా నగరపాలక సంస్థ, మునిసిపల్ , పంచాయత్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెడికల్ అధికారులు పి.హెచ్.సి ల పరిధిలో ప్రజలకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలన్నారు. అవసరం మేరకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మురుగు కాలువల వద్ద నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు చర్యలు తిసుకోవాలని జిల్లా పంచాయతి అధికారికి సూచించారు. పంచాయత్ రాజ్ ఇంజనీర్లు ఆర్.డబ్ల్యు.ఎస్ శాఖల అధికారుల సమన్వయంతో చేతి పంపులను మరమ్మత్తు చేసి వాటి ద్వారా వచ్చే నీటిని పరీక్షలు నిర్వహించి సురక్షిత నీటిని ప్రజలకు అందించేలా చర్యలు తిసుకోవాలన్నారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు సంక్షేమ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి వ్యాదులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

1 వ తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు కలసి జిల్లా నందు ఈ నెల 10 న నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ను పండగ వాతావరణంలో జరిపి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబందిత శాఖల అధికారులు సమన్వయము చేసుకొని పిల్లల తల్లిదండ్రులను, ప్రజా ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించాలన్నారు. ఇందుకు సంబందించి ఇదివరకే విద్యా శాఖ ద్వారా జారి చేసిన సూచనలను తప్పని సరిగా పాటించాలన్నారు.

పి -4 లో భాగంగా ప్రతి జిల్లా అధికారి, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలన్నారు. ఈ శనివారం లోపు ప్రతి రెవెన్యు డివిజన్ లో కనీసం 20 మందికి తక్కువ కాకుండా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు. తాను కూడా కలెక్టరేట్ కార్యాలయ సమీపంలోని నక్కల కాలనీలో మూడు కుటుంబాలను గుర్తి౦చానన్నారు.

అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ౦ రైతు కుటుంబానికి రూ. 14,000/- , కేంద్ర ప్రభుత్వం రూ. 6000/- వెరసి మొత్తం రూ. 20,000/- ఆర్ధిక సహాయం అందించను౦దన్నారు. ఆ మొత్తాలను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలని తెలిపారని, ఇందులో భాగంగా తహశీల్దార్ లాగిన్స్ లో దాదాపు 58,000 రికార్డ్స్ పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇందుకు ఒకటి రాంగ్ డేటా కారణం కాగా, ఒక రైతుకి వేరోకరి ఆధార్ నెంబర్ లింక్ కావడం, రైతుల ఆధార్ నంబర్లను లాండ్ రికార్డ్స్ కి లింక్ చేయకపోవడం, మూడోది చాలా మంది రైతులకు ఒకే ఆధార్ నెంబర్ ఉండడం, అట్లాగే చాలా మంది రైతులకు ఒకే ఎక్స్టెంట్ ఉండడం ఇలా వివిధ కారణాల వల్ల అవన్నీ కూడా తహశీల్దార్ లాగిన్ కు ఫార్వర్డ్ చేయడం జరిగిందన్నారు. వీటిని త్వరగా సరిచేసి సాద్యమైనంత ఎక్కువ మంది అర్హత కలిగిన రైతులకు లబ్ది కలిగించేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి వివరాలను మెయిల్ చేయడం జరిగిందన్నారు. సిసిఆర్సి కి సంబంధించి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందన్నారు. జిల్లాలో 10,000 సిసిఆర్సి కౌలు రైతుల లక్ష్యానికి గాను దాదాపు ఇప్పటి వరకు 4500 చేసామని మిగిలిన 5500 మందికి కూడా ఈ అన్నదాత సుఖీభవ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోజ్ మాండ్, డి ఆర్ డి ఏ పి డి శోభన్ బాబు, డ్వామా పిడి శ్రీనివాసరావు, డి ఎం అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్, సివిల్ సప్లై అధికారి రాజు, ఎంప్లాయిమెంట్ అధికారి రమణ, ఎక్సైజ్ శాఖ అధికారి వాసుదేవ చౌదరి, మార్కెటింగ్ శాఖ అధికారి సురేంద్ర, పశుసంవర్ధక శాఖ అధికారి డా. ప్రసాద్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *