Breaking News

ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు యావత్ తెలుగు మహిళా నారీమణులందరికీ అవమానకరం….

-రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలకి సమాజంలో సమానత్వ హక్కు సాధించే దిశగా ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆస్తిలో సగం హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది అని తల్లి చెల్లి అని కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపించేసిన దుష్ట సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది అంటూ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహర ప్రసాద్ దుయ్యబట్టారు. మంగళవారం విజయవాడ పైపుల రోడ్ లో తన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వైసిపి నేత ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళ నారీ మణులందరి ని వ్యక్తిత్వాహనం చేశాయి. 2024 ఎన్నికల్లో వేలాది సంఖ్యలో గిరిజనులు ఉన్నారు. వైసిపి అధికారంలో ఉండగా అధికారం మత్తుతో ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో చేసిన నీతిమాలిన వ్యాఖ్యలతో గత ఎన్నికల్లో గిరిజనులు వైసీపీకి వ్యతిరేకంగా కూటమికి ఓట్లు వేశారు. అయినా సరే రాష్ట్రంలో వైసిపి నేతలకు బుద్ధి రాలేదు. వైసీపీ నేతలతో మహిళలను కించపరిచే సంస్కృతి కొత్తది కాదు. గతంలో అడ్డగోలు అబద్ధాలు హామీలతో గద్దినెక్కిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అమరావతి మహిళా రైతులు ఉద్యమం సాగించారు. అటువంటి ప్రజా ఉద్యమంపై విషం చిమ్ముతూ జగన్ రెడ్డి ఆయన వైసీపీ అనుయాయులతో అమరావతి మహిళలపై భౌతిక దాడులు చేస్తూ బూతులు తిట్టిస్తూ అక్రమ కేసులు బనాయించాడు. ఆయన పేపర్, టీవీ ఛానల్ లో జర్నలిస్టు ముసుగులో ఉన్న వైసిపి తోడేళ్లతో అమరావతి మహిళలు వేశ్యలు అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేయించాడు. సొంత బాబాయ్ హత్యపై తన చెల్లెలు సునీత రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ రౌడీలతో తీవ్ర దుర్భాషలతో విమర్శలు చేయించాడు. సొంత చెల్లి షర్మిల రెడ్డి ఆవిడకి చెందాల్సిన హక్కులపై జగన్ రెడ్డిని కోరినప్పుడు నిర్దాక్షిణ్యంగా మెడపట్టి బయటకు గెంటాడు. కన్నతల్లి విజయమ్మను పార్టీ నుంచి వెలివేశాడు. గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి కన్నతల్లి లాంటి భువనేశ్వరమ్మ పై వైసిపి సైకో నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంటే వెకిలిగా నవ్వుతున్నాడే గానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు తానా అంటే తందానా అన్న చందాన వైసీపీ పార్టీలో ప్రధమ శ్రేణి నాయకుడి నుంచి కార్యకర్త వరకు మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు మహిళలపై దుర్భాషలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి అనే వైసిపి మాజీ ఎమ్మెల్యే మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ సంఘటన బట్టి చూస్తే వైసీపీ పార్టీలో మహిళల పట్ల భావజాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు అనే స్వార్థంతోనే మహిళలను కించపరుస్తూ వైసిపి నేతలు తీవ్ర అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మహిళా నారీమణులందరికీ అండగా నిలుస్తున్నారని, ప్రసన్న కుమార్ రెడ్డి పై చర్యలు తీసుకుని యావత్ మహిళ లోకానికి క్షమాపణలు చెప్పించాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలి -పంచాయతీరాజ్, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *