-జిల్లా వ్యాప్తంగా 976 ప్రభుత్వ, 568 ప్రవేటు పాఠశాలల్లో, 120 ఇంటర్మీడియట్ కళాశాలల్లో ..
-డీ ఈ వో కే వాసుదేవరావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ని పురస్కరించుకొని శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంకి సంబందించి, గురువారం రోజు నాడు షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి మెనూ వెజిటేబుల్ రైస్ / పులావ్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ ని మాత్రమే విద్యార్థులకి, మెగా పేరెంట్ మీట్ కు హాజరయ్యే విద్యార్థుల తల్లి తండ్రులకు,సంరక్షకులకి వండి వడ్డించడం జరుగుతుందని, ఈ మేరకు డైరెక్టర్, మిడ్ డే మీల్స్ మరియు స్కూల్ సానిటేషన్, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి ఆదేశాలు సూచనలు మేరకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చెయ్యడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొని వారి విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. విద్యార్థుల ద్వారా తల్లితండ్రులకు, సంరక్షకు లకు ఈ మెగా పేరెంట్ మీట్ లో పాల్గొనాలని ఆహ్వానించడం జరిగిందన్నారు.
ప్రస్తుతం జిల్లాలో 976 పాఠశాలలు మరియు 15 జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పధకం అమలు జరుగుతున్నట్లు, ప్రతి నెల కుకింగ్ కాస్ట్ మరియు అడిషనల్ మెనూ క్రింద ప్రాధమిక పాఠశాలకు Rs.5.88/- పైసలు అలాగే ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలకు Rs.8.57/- పైసలు చొప్పున ప్రతి విద్యార్ధికి చెల్లించడం జర్గుతున్నదనీ తెలియ చేశారు. అదే విధముగా మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు కు సంబంధించి (కేంద్ర ప్రభుత్వం రూ.1000, రాష్ట్ర ప్రభుత్వం రూ.2000 వెరసి మొత్తం @ 3000/- చొప్పున ప్రతి కార్మికులకు చెల్లించడం జరుగుతున్నట్లు తెలిపారు.
మెగా పేరెంట్ మీట్ నేపథ్యంలో కొన్ని ప్రధానోపాధ్యాయులు (HMs) తమ స్థాయి నుండి ఏజెన్సీలకు అదనపు ఆహారం ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తోందన్నారు. ఈ విధమైన స్వచ్ఛంద నిర్ణయాలు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు కాదనీ, ఇటువంటి ఘటనలు నేపధ్యంలో సంబంధిత అధికారులపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు డీ ఈ వి వో వాసుదేవ రావు తెలియ చేశారు. విద్యార్థులకు ఆరోగ్యకర , పోషక విలువలు కలిగిన భోజనం అందచేయుట ప్రాధాన్యం అని తెలియజేయాడ మైనది.
Prajavartha Online Telugu News