Breaking News

విద్యా శాఖా ఆద్వర్యంలో తూర్పు రెడ్ క్రాస్ లో 100 శాశ్వత సభ్యత్వము

-రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలి
-కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతంగా విస్తరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పీ. ప్రశాంతి తెలిపారు. జిల్లా పాఠశాల విద్యాధికారి కె. వాసుదేవరావు ఆధ్వర్యంలో 100 మంది శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్‌లో చేరారు. వారికి సంబంధించిన రూ.1,10,000 చెక్కును జిల్లా కలెక్టర్ & తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు పి. ప్రశాంతి ద్వారా తూర్పు విభాగం రెడ్ క్రాస్ ప్రతినిధి డా. జి. మహాలక్ష్మికి అందజేశారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, “రెడ్ క్రాస్ కార్యకలాపాలు సామాజిక సేవలో కీలకమైనవన్నారు. ఈ కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంలో సభ్యత్వ నమోదు ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో రెడ్ క్రాస్ కార్యకలాపాలు విస్తృత చెయ్యడంలో సభ్యత్వ నమోదు డ్రైవ్‌ను ప్రోత్సహిస్తూ, అన్ని వర్గాల ప్రజలలో చైతన్యం కలిగించాలని సూచించారు.. కొవ్వూరు, రాజమండ్రి డివిజన్ల పరిధిలో మొత్తం 500 మంది సభ్యత్వాలు నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె తెలిపారు. అలాగే విద్యాసంస్థల విద్యార్థులు “యూత్ రెడ్ క్రాస్” సభ్యులుగా , పాఠశాల విద్యార్థులు జూనియర్ రెడ్ క్రాస్ సభ్యులుగా చేర్చబడేలా ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల మానవీయ విలువలు, సమాజ సేవపై అవగాహన పెంపొందించేందుకు రెడ్ క్రాస్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *