Breaking News

నిరుద్యోగ యువతకు కువైత్‌లో అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు

-వి డి జి మురళి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (OMCAP) సంయుక్తంగా THATRUYA (https:// thatruya.com/) అనే అంతర్జాతీయ సంస్థతో కలిసి, కువైత్‌లో ఉన్నత నైపుణ్యం కలిగిన నిర్మాణ కార్మికుల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని తూర్పు గోదావరి జిల్లా కు చెందిన అర్హత కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అవకాశానికి 24 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుష అభ్యర్థులు, సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ లేదా సీలింగ్ పనుల్లో మరియు ఐ టి ఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అలాగే 3-5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండడం తప్పనిసరి అని తెలియ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు కువైత్ లో ఉద్యోగావకాశం, నెలకు కువైట్ డాలర్ KWD 200 నుండి 250 (భారత రూపాయలలో సుమారు రూ.56,000 – రూ.70,000 వరకు) జీతంగా లభించనున్నట్లు తెలిపారు.

ఇతర వివరాలు …

ఉద్యోగ ఒప్పంద కాలవ్యవధి 2 సంవత్సరాలు.

ఇతర సౌకర్యాలు:
వీసా ప్రాసెసింగ్, విమాన టికెట్లు, వైద్య సదుపాయాలు మరియు షేర్ చేయబడిన నివాస ఏర్పాట్లను కంపెనీ అందిస్తుంది.

అభ్యర్థులు తమ పాస్పోర్ట్, ITI/Diploma సర్టిఫికేట్, అనుభవ సర్టిఫికేట్ లను సమర్పించాలి.

దరఖాస్తు చేసే విధానం:

వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in

ఈమెయిల్: skillinternational@apssdc.in

సంప్రదించాల్సిన నంబర్:  9988853335

దరఖాస్తు చివరి తేదీ: 12-07-2025

ఈ అంతర్జాతీయ ఉపాధి కల్పన అవకాశాన్ని తూర్పు గోదావరి జిల్లాలోని అర్హత కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *