Breaking News

అన్న క్యాంటీన్‌లో తిన్న కలెక్టర్

పార్వతీపురం,నేటి పత్రిక ప్రజావార్త :
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్‌లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్‌లో భోజనం అందుకున్నారు. ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్‌ లోపల, బయట, చుట్టుపక్కల పారిశుధ్యం తనిఖీ చేయాలనుకున్న జిల్లా కలెక్టర్, ఆకస్మికంగా క్యాంటీన్‌కు వెళ్ళారు. భోజనంకు వచ్చిన వారితో పాటు ఆహారం తింటూ అన్నా కాంటీన్ లో ఆహార నాణ్యత తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారి స్పందనను కోరారు. అన్నా క్యాంటీన్ నాణ్యత, నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి పరిచారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం రోజుకు దాదాపు రూ.90 ఖర్చు చేసి, వారికి రూ.15 కనీస ఖర్చుతో అందిస్తున్నదన్నారు. ప్రజలు అన్నా కాంటీన్ లో ఆహారాన్ని తీసుకోవాలని, ఆకలితో ఉండకూడదని కోరారు. క్యాంటీన్‌లో ఏవైనా లోపాలు ఉంటే తెలియజేయాలని, వాటిని వెంటనే సరిచేస్తామని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *