Breaking News

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పీవీఎన్‌ మాధవ్…

-నా ముందు అధ్యక్షులైన వారి శక్తి యుక్తులతో ముందుకు వెళ్తా..
-ప్రతీ కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానని అన్నంతగా పని చేస్తా
-లెనిన్ కి భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు..
-ఇక మీదట అది లెనిన్ సెంటర్ కాదు..
-కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సెంటర్‌గా పిలవాలన్న మాధవ్..

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పీ వీ ఎన్ మాధవ్ అధికారికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్.ఎల్.సీ సోము వీర్రాజు బీజేపీ ఎమ్మెల్యేలు , ముఖ్య నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరయ్యారు. తొలుత తుమ్మల పల్లి కళాక్షేత్రం వద్ద నున్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాక్షేత్రం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

లెనిన్ సెంటర్ పేరు మార్చాలి…. : పీ వీ ఎన్ మాధవ్
విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని పీ వీ ఎన్ మాధవ్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ర్యాలీ గా వెళ్లిన మాధవ్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తో కలిసి లెనిన్ సెంటర్ లోని విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెనిన్ కు మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేనప్పుడు లెనిన్ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. తెలుగు భాష కోసం నిరంతరం శ్రమించిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వారి సిద్ధాంతాలను కొనసాగిస్తానని మాధవ్ తెలిపారు. ప్రతి కార్యకర్త అధ్యక్షుడిగా తానే అధ్యక్షుడు అయ్యానని ఫీల్ అయ్యేంతగా పనిచేస్తానని మాధవ్ అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాకంటే ముందు అధ్యక్షులైన వారి శక్తి యుక్తులతో ముందుకు వెళ్తాను అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అరాచక పాలనకు చరమగీతం పాడారని కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ నిచ్చి గెలిపించారన్నారు. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని తెలిపారు.

రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ప్రతీ కార్యకర్త అంకిత భావంతో పని చేయడం వల్ల 25 లక్షల సభ్యత్వాలకు చేరుకున్నామన్నారు. బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఆధారంగా అన్ని స్ధాయిలలో అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. జాతీయ కౌన్సిల్ మెంబర్ల నియామకం కూడా పూర్తయింది అన్నారు. మాధవ్ తండ్రి చలపతిరావు పోరాట పటిమ కలిగిన వ్యక్తి అని ఎమర్జెన్సీ టైమ్ లో చలపతిరావు దంపతులు జైలుకు వెళ్ళారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంస్ధాగత అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మాధవ్ అని పేర్కొన్నారు. కార్యకర్తలు అందరూ బీజేపీ కుటుంబసభ్యులని రెండు సంవత్సరాల ప్రస్ధానంలో తనకు సహకారం అందించిన వారందరికీ ఈ సందర్భంగా పురంధేశ్వరి ధన్యవాదములు తెలిపారు.

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్.ఎల్. సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీ బీజేపీ కార్యకర్తలు అందరూ మాధవ్ ని అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నారన్నారు మాధవ్ అధ్యక్షుడుగా ప్రకటన జరిగాక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయన్నారు ఏపీ లో బీజేపీని ఉన్నత స్ధాయికి తీసుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో బలోపేతం అవ్వడమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఈశ్వరరావు,రామకృష్ణారెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *